భీమవరం లో ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా
ఫోటోస్పాట్ : భీమవరం పట్టణంలోని జి.కె.ఆర్. మ్యాజిక్ పిక్చర్స్ లో 11-09-2025 న భీమవరం ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ సంఘం ట్రెజరర్ చిలకుర్తి శేషు అధ్యక్షత వహించగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ మరడాని రాము మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఫోటోస్పాట్ : భీమవరం పట్టణంలోని జి.కె.ఆర్. మ్యాజిక్ పిక్చర్స్ లో 11-09-2025 న భీమవరం ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ సంఘం ట్రెజరర్ చిలకుర్తి శేషు అధ్యక్షత వహించగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ మరడాని రాము మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే, ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ మాట్లాడుతూ, త్వరలోనే భీమవరంలో పెద్దల సహకారంతో ఫోటో భవన్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు.నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.డి. అమీర్ బాషా నిర్వహించారు. అదేవిధంగా భీమవరం యూనియన్ వ్యవస్థాపకులు ఘంటా వెంకటేష్ రావు గారిని మరియు ఆయన సోదరులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు స్వామి నాయుడు, సెక్రటరీ చిలకపాటి సుందర్, ట్రెజరర్ రాముతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఫోటోగ్రఫీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మండలాల యూనియన్ అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే భీమవరం యూనియన్ చైర్మన్ నాగు, జంగ మాణిక్యాలరావు, ఘంటా గణేష్, ముక్కా సింహాద్రి, ఘంటా చంటి, తిరునాదం చిట్టిబాబు, తిరుమునాదం నారాయణ, అలాగే కాళ్ళ మండలం రిపోర్టర్ నాగరాజు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










