టి.నరసాపురం మండలంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా
ఫోటోస్పాట్ ఆగస్టు 19: టి.నరసాపురం మండలం సూపర్ సీనియర్స్ లూయిస్ డాగురే ఫోటో & వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం సెక్రటరీ పలగాని ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మహారాజ్ నాయకత్వం వహించారు. ముందుగా ఫోటోగ్రఫీకి పునాది వేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త, కెమెరా ఆవిష్కర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల అర్పించి ఆయనను స్మరించారు. అనంతరం జరిగిన సభలో సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ, “ఫోటో అనేది నేటి జ్ఞాపకాలను రేపటి తరాలకు పదిలంగా నిలిపే మాధ్యమం.
ఫోటోస్పాట్ ఆగస్టు 19: టి.నరసాపురం మండలం సూపర్ సీనియర్స్ లూయిస్ డాగురే ఫోటో & వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం సెక్రటరీ పలగాని ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మహారాజ్ నాయకత్వం వహించారు. ముందుగా ఫోటోగ్రఫీకి పునాది వేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త, కెమెరా ఆవిష్కర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల అర్పించి ఆయనను స్మరించారు. అనంతరం జరిగిన సభలో సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ, “ఫోటో అనేది నేటి జ్ఞాపకాలను రేపటి తరాలకు పదిలంగా నిలిపే మాధ్యమం. అలాంటి కెమెరాని కనుగొన్న లూయిస్ డాగురేను స్మరించుకోవడం ప్రతి ఫోటోగ్రాఫర్‌కి గర్వకారణం” అని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ మహారాజ్ మాట్లాడుతూ, “మా యూనియన్ ఇంతకుముందు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. ఇక ముందు రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలతో పాటు ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధికి తోడ్పడతాం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు భార్గవ్, సత్యనారాయణ, సునీల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ రంగం ప్రాముఖ్యత, ఫోటోగ్రాఫర్ల భవిష్యత్ అవకాశాలపై కూడా చర్చలు జరిగాయి.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకలో ఉత్సాహం నిండిన వాతావరణం నెలకొంది.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










