యశోద హాస్పిటల్‌లో భరత్ కుమార్‌ను పరామర్శించిన రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు
ఫోటోస్పాట్ : నల్లగొండ జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పసుపులేటి కృష్ణ గారి కుమారుడు భరత్ కుమార్ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఫోటోస్పాట్ : నల్లగొండ జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పసుపులేటి కృష్ణ గారి కుమారుడు భరత్ కుమార్ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం యశోద హాస్పిటల్‌కి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు భరత్ కుమార్‌ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి భీమిడి మాధవ రెడ్డి, కుటుంబ భరోసా ఇన్‌ఛార్జ్ బోల్గురి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంధం ఉపేంద్ర కుమార్, సంయుక్త కార్యదర్శి సామల వెంకటేశ్వర్లు, నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి దాశపత్రి జనార్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు భరత్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, పసుపులేటి కృష్ణ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రమాదం విషాదకరమైనదైనా, చికిత్స ఫలప్రదంగా సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ సార్ ఫోన్ ద్వారా పసుపులేటి కృష్ణను సంప్రదించి పరామర్శించారు. రాష్ట్ర అసోసియేషన్ ఎల్లప్పుడూ తన సభ్యుల కుటుంబాలకు అండగా ఉంటుందని, ఏ విషయంలోనూ ఆందోళన చెందవద్దని ఆయన ధైర్యం చెప్పారు.ఈ ఘటనపై ఫోటోగ్రఫీ వర్గాల్లో విచారం వ్యక్తమవుతున్నప్పటికీ, భరత్ కుమార్ త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










