ఉచితంగా ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు త్వరగా రిజిస్టర్ చేసుకోండి
ఫోటోస్పాట్ : ఉచితంగా ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు . భాషా, సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ సంయక్త ఆధ్వర్యములో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మరియు సినిమాటోగ్రఫీ రంగాల్లో ఆరు నెలల (ఆఫ్ లైన్ / ఆన్ లైన్ ) ఉచితంగా డిప్లొమా కోర్సు నిర్వహించనున్నారు
ఫోటోస్పాట్ : ఉచితంగా ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు . భాషా, సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ సంయక్త ఆధ్వర్యములో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మరియు సినిమాటోగ్రఫీ రంగాల్లో ఆరు నెలల (ఆఫ్ లైన్ / ఆన్ లైన్ ) ఉచితంగా డిప్లొమా కోర్సు నిర్వహించనున్నారు . అందుకు సంభందించిన గోడ పత్రికను పత్రికలను భాష తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారితో కలిసి సిగ్మా అకాడమీ చైర్మన్ ఎం.సి.శేఖర్ మరియు సెక్రటరీ కే.జనార్దన్ గార్లతో కలిసి ఈరోజు ఆవిష్కరించారు . ఫోటోగ్రఫీ అభిరుచి గలవారు లేదా వృత్తిగా స్వీకరించేవారికి ప్రాథమిక ఫోటోగ్రఫీ తోపాటు పిక్టోరియల్ షూటింగ్ నైపుణ్యాలను, అధునాతన సాంకేతికతలు, కంపొజిషన్, లైటింగ్, ఫ్రేమ్మింగ్, పోసింగ్ లలో అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ . ఈ ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్స్ ఫోటోగ్రఫీ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో పట్టణ మరియు గ్రామీణ యువతకు సహాయం చేయడమే కాకుండా ఫోటోగ్రాఫర్‌గా ఎదిగి, వృత్తిగా స్వీకరించేవారికి రెండవ బ్యాచు ను వచ్చే నెల నవంబర్ 14 నుండి శిక్షణ తరగతులు ప్రారంభించబడును .ఆసక్తి కల అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్లలో ( 8008021075 - 7095692175 ) ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల లోపు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.వెబ్సైటు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు https://sapindia.org/free-workshops/ లింక్ ద్వారా చేసుకోగలరు... అక్టోబర్ 31, 2024
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?