మీతో పాటూ నేనూ- సుధీర్ సాండ్ర

సృష్టికి ప్రతిసృష్టి చేసేవారు ఫోటోగ్రాఫర్స్. అలాంటి కళాకారులు ఆర్ధికంగా మరియు సంఘంలో తమకంటూ ఒక గుర్తింపు పొందడానికి మీ ముందుకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు & మోటివేషనల్ స్పీకర్ శ్రీ సుధీర్ సాండ్రా గారితో ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ...

Feb 9, 2023 - 12:35
Feb 11, 2023 - 17:00
 0  77
మీతో పాటూ నేనూ- సుధీర్ సాండ్ర

సృష్టికి ప్రతిసృష్టి చేసేవారు ఫోటోగ్రాఫర్స్. అలాంటి కళాకారులు ఆర్ధికంగా మరియు సంఘంలో తమకంటూ ఒక గుర్తింపు పొందడానికి మీ ముందుకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు & మోటివేషనల్ స్పీకర్ శ్రీ సుధీర్ సాండ్రా గారితో ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ...

వ్యక్తిత్వ వికాసం మరియు మీ రంగంలో ఉన్నతస్థాయికి ఎదగడం పై ప్రత్యేక కథనం ఫోటోస్పాట్ లో...

నా చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య ఏం చెప్పేవాళ్ళంటే ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు అంటే భగవంతుడు అనేవారు. సృష్టిలో ఏది చూసిన అది భగవంతుడి సృష్టే అనుకున్నాను. కాని కొంతకాలం తర్వాత నేను ఎప్పుడైతే స్కూల్ కి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత చిన్ననాటి ఫోటోస్ అంటే ఒక తరగతి అయిపోగానే అందరికి గ్రూప్ ఫోటోస్ తీసేవారు. నేను వేరే తరగతికి వెళ్ళిన తర్వాత అప్పటి ఫోటోస్ చూసుకోగానే ఒక్కసారిగా ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేవి. అప్పుడు నాకు అర్ధమైంది ఏంటంటే భగవంతుడు అందాలను, ప్రకృతిని మొత్తం సృష్టిస్తాడు కాని కాలాన్ని తిరిగి తీసుకురాలేడని. కాలాన్ని ఎవరు ఆపలేరు, ఆ కాలాన్ని వెనక్కి ఎవరూ తీసుకురాలేరు అనుకుంటాం. కాని నా దృష్టిలో ఆ కాలాన్ని వెనక్కి తీసుకురాలేము కాని ఆ కాలంలోకి తిరిగి వెనక్కి వెళ్ళవచ్చు. అది ఎవరు చేస్తారంటే భగవంతుని తర్వాత ఒకే ఒక్క సృష్టి కర్త అతడే ఫోటోగ్రాఫర్ లేదా వీడియోగ్రాఫర్. అంతకంటే ఎవరుండరు ఆ భగవంతునితో సమానంగా ఆ కాలాన్ని అక్కడికి తీసుకెళ్ళి ఆ క్షణంలో ఏ ఏ అనుభూతులు పొందామో అన్ని కలిపి మనకి సమూహంగా ఇచ్చే వ్యక్తి కేవలం ఫోటోగ్రాఫర్ మాత్రమే. నిజంగా చాలా సంతోషం ఈ రోజు చాలా మందిని నేను ఈ వృత్తిలో చూస్తున్నాను. అందరూ ఏదో కేవలం ఫోటోలు తీయాలి, డబ్బులు సంపాదించాలి అనే కాకుండా ఒక ప్యాషన్ తో వచ్చి చాలా చక్కగా ఎంతో మందికి కొన్ని వేల లక్షల జ్ఞాపకాలని అందిస్తున్నారు. అలాంటి ఫోటోగ్రాఫర్ ఇప్పుడున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మేము కొన్ని చిట్కాలు తెలియజేస్తున్నాం.

ఈ రోజుల్లో ఫోటోగ్రఫీ అంటే ఒక వృత్తిలాగా అందరూ తీసుకుంటున్నారు. చాలా సంతోషం కానీ ఈ ఫోటోరంగం లో కూడా చాలామందికి ఉపాధి దొరక్క, సరైన సంపాదనలేక అప్పులు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫోటోగ్రఫీ రంగంలో అందరూ బాగుండాలనే ఉద్దేశ్యంతో ఫోటోస్పాట్ ఈ నూతన ఆలోచనతో శ్రీకారం చుట్టారు. ఈ వృత్తిలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ఏమేమి చేయాలి.. ఎలాంటి విధానాలు పాటిస్తే తమ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళవచ్చు. కుటుంబ జీవితాన్ని వ్యాపార జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. కొత్త మెళకువలు ఎలా తెలుసుకోవాలి, అలాగే భవిష్యత్ తరాలకు తనను తానూ ఎలా బ్రాండింగ్ చేసుకోవాలి అనే అంశాలపై పట్టు సాధించినట్లయితే ఎవరైనా ఉన్నతస్థాయికి ఎదగవచ్చు. ఏ రంగంలో అయినా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు వచ్చే కొత్త ఆలోచనే మనల్ని జీవితంలో పైకి తెస్తుంది. ఇంకా మీరు సంపాదించినా ప్రతి రూపాయిని ఎంత బాగా ఖర్చు పెట్టాలి, మీరు సంపాదించే 100 రూపాయలలో, 10 రూ. ఖర్చు పెట్టి 90 రూ. మీ భవిష్యత్తుకి ఎలా ఆదా చేసుకోవాలి. ఏ వ్యాపార వేత్త అయిన తీసుకోండి వాళ్ళు 100 రూ. సంపాదిస్తే అందులో 10. రూ. ఖర్చు పెట్టి 90.రూ ఆదా చేసారు కాబట్టే ఈ రోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము. రేపటి రోజు మీరు కూడా అక్కడ ఉండాలంటే ఈ విషయాలు మీకు బాగా ఉపయోగపడతాయి. బిజినెస్ వచ్చింది చేసుకుంటున్నాం అంతే, కాని ఎంత మంది నిజంగా వచ్చిన ఒక్క రూపాయిలో కనీసం 10 పైసలు అయిన బ్రాండింగ్ కి, మార్కెటింగ్ కి ఖర్చుపెడుతున్నారు. బ్రాండింగ్ లేకుండా వ్యాపారం చేయడం చాల కష్టం. ఈ రోజుల్లో బంగారు వ్యాపారి అయిన బంగారం కొనుక్కొచ్చే ఇస్తాడు. అలాగే మీకు అలాంటి బంగారం మీ కెమెరాలు కావచ్చు, మీ పరికరాలు కావచ్చు, మీ బ్రాండింగ్ కావచ్చు. ఈ రోజు సుధీర్ ఎవరికీ తెలుసంటే ఒక 10 మందికి తెలిసి ఉండవచ్చు. నేను జీవితాంతం ఆ 10 మందికి సేవ చేసుకుంటూ ఉంటే మిగతా లక్ష మందికి ఎలా తెలుస్తుంది. అప్పుడు నేను నేరుగా బయటికి వచ్చి 11 వ వ్యక్తిని కలిసి నా గురించి చెప్తాను. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువవుతారు. అలాగే మీకు ఒక 50 మంది క్లైంట్స్ ఉన్నారనుకోండి ఎప్పుడు మీరు వాళ్ళ ఈవెంట్స్, ఫంక్షన్ చేసుకుంటే పొతే మీ వ్యాపారం ఎప్పటికి అభివృద్ధి చెందుతుంది. కావున రోజుకు ఒక్కొక్కరిని కలిసి వాళ్ళతో మన వ్యాపారం, బ్రాండింగ్, చేసే వర్క్ ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటే మీరు జీవితంలో ఖచ్చితంగా ఎదుగుతారు. ఎంత మంది ఫోటోగ్రాఫర్స్ మీయొక్క వృత్తిని గొప్పగా ఫీల్ అవుతున్నారు. నేను ఈ ఫోటోగ్రాఫర్ వృత్తిలో చాలా బాగున్నాను, మంచి పొజిషన్ లో ఉన్నాను, లేకుంటే నా వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం నేను నా ప్రాణాలైన పెడతాను అనే వాళ్ళు ఎంత మంది ఉంటారు. మీరు వెళ్ళి సచిన్ని 20 ఏళ్ళ నుండి క్రికెట్ ఆడుతున్నారు కదా మీరు ఎప్పుడు బోర్ ఫీల్ అవ్వలేదా అంటే అప్పుడు ఆయన ఎప్పుడైతే క్రికెట్ ఆడనో ఆ రోజు అలా ఫీల్ అవుతాను అనడం జరిగింది. ఈ రోజు మనం చేసే వృత్తి కూడా ఎలా ఉండాలంటే మనకు ఒక బలాన్ని, బలగాన్ని కల్పించే విధంగా ఉండాలే కానీ ఏదో చేస్తున్నాం ఈ రోజు 10 రూ. సంపాదించాం ఖర్చు పెట్టాం అని కాకుండా ఆ 10 రూ.లతో మన భవిష్యతులో మన పిల్లలకు కానీ ఫ్యామిలికి కాని ఒక ఉపాది కల్పించేటట్టు ఉండాలి. చంద్రుని మీద మొదట కాలుమోపిన వ్యక్తి ఏవరంటే నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అని అందరూ అంటారు. ఒక రోజు కెనడాలో ఏం జరిగిందంటే కెనడా వాళ్ళు వచ్చి అమెరికా వాళ్ళకి ఒక సవాల్ విసిరారు ఏంటంటే 10 సం.ల తర్వాత చంద్రుని మీద మొదటి వ్యక్తిని మేము పెడతాం అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అమెరికా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే మేము 5సం.ల లోనే చంద్రుడి మీదకు ఒక అమెరికన్ పంపిస్తాం అని జె.కె.కెనడి అనే వ్యక్తి ప్రకటన విడుదల చేసాడు. వెంటనే అందరూ అమెరికన్లు ఇది మనం చేయాలి అని గట్టి నిర్ణయం తీసుకుని చకచక పనులు మొదలు పెట్టారు. ఈ కార్యానికి అమెరికా గవర్నమెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ చేసింది. కానీ బయటికి ఫలితం ఏ మాత్రం కనిపించడం లేదు. అప్పుడు అమెరికా ప్రతినిధులు అందరూ ఒకసారి పర్యవేక్షణకి వెళ్లారు. అక్కడ గది శుభ్రం చేసే వ్యక్తిని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి ఒక్కసారిగా శుభ్రం చేయడం ఆపి మనిషిని చంద్రుని పైకి పంపిస్తున్న అన్నాడు. ఆ జవాబు విని అందరూ అవాక్కయ్యారు. నువ్వు గది శుభ్రం చేస్తున్నావ్ కదా ఎలా పంపిస్తావు అంటే మా అందరి టార్గెట్ ఒక్కటే ఒక అమెరికన్ ను చంద్రుని మీదకు పంపియడం. మేం అందరం ఆ టార్గెట్ కోసమే పనిచేస్తున్నాము అని అన్నాడు. నేను డైరెక్ట్ గా సహాయం చేయలేకపోవచ్చు. కాని ఇది వాళ్ళకు అవసరం కాబట్టి నేను చేసే ఈ వృత్తి వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి నావంతు ప్రయత్నంగా నేను ఈ పని చేస్తున్నాను. ఈ రోజు మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా నేను ఒక గొప్ప వృత్తిలో ఉన్నాను అని ఎప్పుడు అనుకుంటారో ఖచ్చితంగా మీకే తెలియకుండా కొత్త ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే మీరు మీ సాయశక్తుల పనిచేసినప్పుడే. చాల మంది చెప్తుంటారు నేను చాలా కష్టపడ్డాను, పెట్టుబడి పెట్టాను కానీ ఫలితం రాలేదు అని. కానీ పది శాతం చేసిన పనికి వంద శాతం ఆదాయం రావడం అత్యాశే అవుతుంది. ఇకపై మీరు ఫోటోగ్రఫీ వృత్తిలోనే ఉంటూ ఆర్థికంగా, వ్యక్తిగతంగా  ఎదగడానికి సహాయ సహకారాలు అందించటానికి  మీతో పాటూ నేనూ కూడా...

మీ ఫోటోస్పాట్ తో

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow