కస్టమ్ బోకే ఎఫెక్ట్ -గోపి క్రిష్ణా రెడ్డి

ఫోటో స్పాట్: మనం ఎన్నో రకాల ఈవెంట్స్ తీస్తూ ఉంటాం, మనం తీసే ప్రతీ ఈవెంట్ లో కూడా వివిధ రకాల లైటింగ్ డెకరేషన్స్ తో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వుంటారు మన Clients. అందులోనూ రాత్రి వేళ జరిగే ఈవెంట్స్ లో అయితే లైటింగ్ తోనూ చాల ఎక్కువగా డెకరేషన్స్ చేస్తూ వుంటారు.

Feb 9, 2023 - 13:52
Feb 11, 2023 - 17:01
 0  182
కస్టమ్ బోకే ఎఫెక్ట్ -గోపి క్రిష్ణా రెడ్డి

ఫోటోస్పాట్:   మనం ఎన్నో రకాల ఈవెంట్స్ తీస్తూ ఉంటాం, మనం తీసే ప్రతీ ఈవెంట్ లో కూడా వివిధ రకాల లైటింగ్ డెకరేషన్స్ తో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వుంటారు మన Clients. అందులోనూ రాత్రి వేళ జరిగే ఈవెంట్స్ లో అయితే లైటింగ్ తోనూ చాల ఎక్కువగా డెకరేషన్స్ చేస్తూ వుంటారు. మనం ఆ లైటింగ్ ఫొటోస్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా రికార్డు చేస్తూ వుంటాం. అలా రికార్డు చేసిన వాటికి ఫోటోషాప్ లో ఎఫెక్ట్స్ Add చెయ్యడం జరుగుతుంది. మనం ఇప్పుడు తెలుసుకోబోయే అంశంలో ఫోటోషాప్ ను ఉపయోగించకుండా మనం తయారు చేసుకున్న కస్టమ్ షేప్ లో మనం తీసే Subject వెనకాల వుండే లైటింగ్ ఆ షేపులలో వచ్చే విధంగా చేయవచ్చు. అవి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

ముందుగా Black Colour Paper Board ను తీసుకుని దానిని మీ కెమెరా లెన్స్ ముందు భాగం సైజ్ ఎంత వుందో అంత సైజ్ లో కట్ చేసుకోండి. మీరు పేపర్ బోర్డు Round గా Cut చేసే టైమ్ లో Roundకు ఎడమవైపు మరియు కుడివైపు కొద్దిగా extra cut చేసుకోండి ఎందుకంటే ఇది లెన్స్ కి సపోర్ట్ కోసం. తరువాత మీరు cut చేసిన round shape లో మధ్య భాగాన్ని మీ subject వెనకాల ఉన్న లైటింగ్ ఏ shape లో వుండాలి  అనుకుంటున్నారో ఆ shape లో cut చేయండి. ఇక్కడ మీరు heart shape లో cut చేసిన దానిని చూస్తున్నారు. ఈ విధంగా మీకు వచ్చిన వివిధ రకాల shapes లో ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని రెడిగా పెట్టుకోండి. తరువాత మీ కెమెరాలో Nikon అయితే ‘A’ లోను Canon అయితే ‘AV’ mode లో select చేసుకొని అపాచ్యుర్ value ఎంత తక్కువ వుంటే అంత తక్కువ select చేసుకోవాలి. మీ వద్ద ఉన్న కెమెరాను ట్రైపాడ్ కు attach చేయవలెను.

ఇప్పుడు మీరు కట్ చేసిన shape ను మీ కెమెరా లెన్స్ కు స్టిక్ చేయండి. ఇక్కడ మీరు వాడే ఏ కెమెరా అయినా అంటే ఉదాహరణకు crop sensor కెమెరా లేదా full frame camera ఏది అయినప్పటికిని 1.8 లేదా 2.8 F నెంబర్ కలిగి ఉన్న fixed లెన్స్ వాడటం మంచిది. తరువాత మీ కెమెరాలో వుండే focus mode manual select చేసుకోండి. తరువాత subject ను  కెమెరాకి దగ్గరగా వుండే విధంగా చూసుకొని subject ను focus చేయండి. subject వెనకాల ఉన్న లైటింగ్ ఎక్కువ దూరంలో వుండే విధంగా చూసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా subject focus అయ్యి వెనకాల ఉన్నటువంటి లైట్స్ అన్ని కూడా మీరు ఏ విధమైన shape cut చేసి లెన్స్ కి attach చేస్తారో ఆ విధమయిన shape లో కనబడటం జరుగుతుంది. ఇదే BOKEH Effect ను subject లేకుండా లైటింగ్ లో లైట్స్ మాత్రమే కావాలనుకుంటే డైరెక్ట్ గా ఆ లైటింగ్ లో లైట్స్ ను shoot చేయవచ్చును. అలాగే ఈ BOKEH Effects ఉన్న వాటిని మీరు photoshop లో ఉపయోగించుకోవాలి అనుకుంటే ఒక black colour background తీసుకుని background మీద వివిధ రకాల LED లైట్స్ ఏర్పాటు చేసుకున్న ఈ BOKEH Effects రావటం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీరు తీసే ఇమేజస్ కొత్తదనాన్ని చూపించాలంటే ఒకసారి ఈ BOKEH Effect ను try చేయండి.

-మేఘాలయ డిజిటల్స్, గోపి క్రిష్ణా రెడ్డి

Gopi Krishna Reddy CEO Meghala Digital , Technical Advisor Photospot

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow