మీరు బిజినెస్ లో ఉన్నత స్థాయికి

ప్రముఖ సైకాలజిస్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ టైనర్, మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాండ్ర గారు మీరు బిజినెస్ లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ముఖ్యమైన మూడు సక్సెస్ మంత్రాస్ ని ఫోటోస్పాట్ భారతీయంతో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ సక్సెస్ మంత్రాస్ ఆయన మాటల్లో….

Feb 9, 2023 - 12:40
Feb 11, 2023 - 17:00
 0  97
మీరు బిజినెస్ లో ఉన్నత స్థాయికి

ప్రముఖ సైకాలజిస్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ టైనర్, మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాండ్ర గారు మీరు బిజినెస్ లో ఉన్నత స్థాయికి  ఎదగడానికి ముఖ్యమైన మూడు సక్సెస్ మంత్రాస్ ని ఫోటోస్పాట్ భారతీయంతో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ సక్సెస్ మంత్రాస్ ఆయన మాటల్లో....

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూడు సక్సెస్ మంత్రాస్ మీరు కనుక పాటించినట్లయితే మీరు బిజినెస్ లో ఉన్నతస్థానానికి చేరుకుంటారు.

మొదటి మంత్ర : ఇది చిన్నప్పటి నుండి మనం ఎదగడానికి లేదా ముందుకు వెళ్ళలేక పోవడానికి కారణం ఇదే. ఈ ఒక్క దాని వల్లే మనం జీవితంలో చాలా కోల్పోతున్నాం. ఒకసారి నేను పిల్లలకు ఒక వారం పాటు వర్క్ షాప్ క్లాసులు తీసుకుంటున్నాను. వాళ్ళకు తెలుసు నేను ఏంటనేది. నేను టైం అంటే టైం కు వచ్చే వాళ్ళు. నేను తొమ్మిది అంటే తొమ్మిదికి రావాలి. ఒక నిమిషం లేట్ అయినా నేను క్లాసులోకి రానిచ్చేవాడిని కాదు. ఆ రోజు మధ్యానం భోజనం చేసిన తర్వాత 1:30 కి నాకు క్లాసు టైం అయింది. అందరూ టైంకు వచ్చారు. కానీ ఒక అబ్బాయి మాత్రం 1:40 కి క్లాసుకి వచ్చాడు. నేను వెంటనే బాబు నేను నిన్ను క్లాసులోకి అనుమతించను. నువ్వు వెళ్ళి పక్క క్లాసులో కూర్చో అన్నాను. ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఉన్నాడు. వెళ్ళు ఇక్కడ నిలబడి నీ టైం వృధా చేసుకోకు అన్నాను. ఆ ఆబ్బాయి అక్కడి నుండి వెళ్ళలేదు డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. నేను క్లాసు ఆపి బాబు నువ్వు ఇక్కడ నిలపడితే క్లాసుకు అంతరాయం కలుగుతుంది అన్నాను. సారీ సార్ నేను లేట్ గా వచ్చాను. అదే బాబు లేటుగా వచ్చావ్ పరవాలేదు వెళ్ళి పక్క క్లాసులో కూర్చో అన్నాను. సారీ సార్ నేను లేట్ గా వచ్చాను నేను రేపటి నుండి కరెక్ట్ సమయానికి వస్తాను. క్షమించండి సర్ నేను లేట్ గా వచ్చాను అని మూడు సార్లు అన్నాడు. అరే ఎందుకురా లేటుగా వచ్చావు అంటే ఆ అబ్బాయి ఇంకా కారణం చెప్పడం లేదు. ఆ ఆబ్బాయి ఒక మాట అన్నాడు అప్పుడు ఆబ్బాయి దగ్గరి నుండి నాకు ఒక సమాధానం వచ్చింది. సర్ నేను లేట్ గా వచ్చాను అంటే మా అమ్మా భోజనం వండలేదో, స్కూల్ కి వస్తున్నప్పుడు సైకిల్ టైర్ పంచర్ అయిందనో నేను ఏదో ఒక కారణం చెప్తాను. నేను కారణం చెప్తే నన్ను నేను సమర్ధించుకుని నా తప్పును నేను సమర్ధించుకుంటున్నట్టు అవుతుంది కానీ నా తప్పును నేను అంగీకరించినట్టు కాదు సర్ అందుకే నేను అది చెప్పలేదు అన్నాడు. నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా చిన్నప్పటి నుండి ఇదే చేస్తున్నాం. దీన్నే Excuse అంటారు. ఏదో ఒక పని చేస్తూ

దాంట్లో మనం Excuse ఇస్తూ ఉంటాం. ఎలా అంటే ఈ రోజు నేను అక్కడికి వెళ్ళి ఆ పని చేద్దాం అనుకున్న కానీ చేయలేక పోయాను. చిన్నప్పటి నుండి మనం స్కూల్ లో హోం వర్క్ చేయకపోతే అనేక కారణాలు చెప్తాము. సర్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకే హోం వర్క్ చేయలేదు, లేకపోతే మా నాన్న వాళ్ళు బయటికి తీసుకువెళ్ళారు అందుకే చేయలేదు. ఇప్పుడు మీరు బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇది ఎందుకు చేయలేదు అని అడిగితే సర్ చేద్దాం అని అనుకున్నాను. కానీ నాకు ఎవరి సహాయం అందలేదు. ఫోటోగ్రఫీలో వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు. నాకు మా కుటుంబ సహాయం కానీ, బంధువుల సహాయం కానీ దొరకలేదు. ఇక్కడ లోకల్ లో ఇంతే సార్ అని Excuse ఇస్తున్నారు కాని ఎదగడానికి ఉండే Opportunities, Possibilities కనుక్కోవట్లేదు. ఈ రోజు నుండి ఒకటే గుర్తుంచుకోండి accept యువర్ మిస్టేక్స్. ఎందుకు ఎదగడం లేదు అంటే అవును ఎదగట్లేదు తర్వాత నుండి నేను ఎక్కువ పని చేసి ఎదగడానికి ప్రయత్నిస్తాను అనాలే గాని నావల్ల కాలేదు సార్ నేనింతే సర్ అని excuse ఇవ్వకండి. ACCEPT YOUR MISTAKES. yes నేను లేట్ గా వచ్చాను ఇంకోసారి లేట్ గా రాను అనేలా ఉండాలి. ఇకమీదట NO EXCUSE. ఇదే మీ మొదటి సక్సెస్ మంత్ర. రెండవ మంత్ర: ముఖ్యంగా బాగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ మధ్య నేను ఒక దగ్గర చూసాను మనందరికీ తెలుసు గూగుల్ సంస్థ. అందులో ఫోటోగ్రాఫర్స్ కి బాగా సుపరిచితం. ఎందుకంటే మనకు ఏమైనా ఫోటోలు కావాల్సిఉంటే అందులోనుండే తీసుకొని చేస్తూ ఉంటాం. మాములుగా బిజినెస్ సంవత్సరం మార్చి 31 కు పూర్తి అయిపోతుంది. బిజినెస్ సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఏప్రిల్ లో గూగులో టాప్-3 సీఈఓ కేటగిరి బోర్డ్ మెంబర్స్ ఉంటారు కదా ఈ ముగ్గురు వ్యక్తులు మరియు మిగతా 20 మంది బోర్డు మెంబర్స్ కలిసి దూరంగా వేరే ప్రాంతానికి పిక్నిక్ లాగా వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటారో తెలుసా, మనం అయితే సంవత్సరం మొత్తం ఏంత సంపాదించాం? ఎంత లాభం వచ్చింది అని మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళు అలా కాదు సంవత్సరం మొత్తం మీద ఎంత సంపాదించాం, ఏంత లాభం వచ్చింది అని మాట్లాడుకోకుండా "ఈ సంవత్సరం మనం రెండు కోట్లు వచ్చే ప్రాజెక్టు చేసాం కదా కాని మన అశ్రద్ధ వల్ల అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల మనకు రావాల్సిన ప్రాజెక్టులు ఎన్ని పక్క వాళ్ళకు వెళ్ళిపోయాయి. మనం కొద్దిగా అశ్రద్ధ ఉండటం వల్ల ఈ రోజు మనకు రావలిసిన ప్రాజెక్టు వేరే మైక్రోసాఫ్ట్ కి గానో వేరే వాళ్ళకు గానో  వెళ్ళింది. అంటే మనం ఏంత నష్టపోయాం. దాదాపుగా మనకు లాభం వచ్చింది రెండు కోట్లు కానీ మన నిర్లక్ష్యం వల్ల పది కోట్లు నష్టపోయాం. అని అలా అంచనా వేస్తూ ఉంటారు". ఇప్పుడు కొంచెం అలోచించడానికి ప్రయత్నంచండి మనం మాములుగా షాప్ లో లేదా బిజినెస్ లో లాభం వచ్చింది అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచేస్తే మన నిర్లక్ష్యం వలనో లేకపోతే బిజినెస్ చేసుకోకపోవడం వలనో ఒక కస్టమర్ మనదగ్గరికి కాక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మనం ఎంత బిజినెస్ నష్ట పోతున్నాం అని అంచనా వేయాలి. ఎదగాలనుకున్నప్పుడు ఎప్పుడు కుడా ఎంత డబ్బు వస్తుంది అని చూసి మురుసిపోకూడదు. ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఎంతనష్ట పోతున్నాం అని అంచనా వేస్తూ ఆలోచించాలి. ఈ రోజు ఒక పని చేయండి మీ నిర్లక్ష్యం వల్ల పోయిన సంవత్సరంలో ఎంతవరకు మీకు రావాల్సిన ప్రాజెక్ట్స్ రాలేదో, ఎంత నష్టపోయారో లేక్కేయండి. అప్పుడు మీకు అర్ధం అవుతుంది మీ నిర్లక్ష్యం ఖరీదు ఎంతో.. ఇంకోసారి అలాంటి అశ్రద్ధతో కూడిన పనులు చేయకుండా మిమ్మల్ని మీరు, మీ బిజినెస్ ని సన్నద్దం చేసుకోవడమే రెండవ మంత్ర

మూడవ మంత్ర: ఇది నాకు బాగా ఇష్టమైన మంత్ర. అందరి ఇళ్ళలో పిల్లలు ఉంటారు. కొందరు స్కూల్ కి వెళ్తుంటారు కొందరు కాలేజికి వెళ్తుంటారు. మనలో చాలా మంది పిల్లలను అడుగుతూ ఉంటారు. నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావు? నువ్వు 10వ తరగతి చదివిన తరువాత ఏం చేస్తావు? ఇంటర్ చదివిన తర్వాత ఏం చేస్తావు? భవిషత్తులో నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు అని మీరు వాళ్ళ లక్ష్యాలు అడుగుతుంటారు. ఇది చేసిన తర్వాత ఇది చేస్తే భవిషత్తు బాగుంటుంది అని చెప్తుంటారు. కాని వాడు వెళ్తున్న మార్గంలో వాడికి బాగా తెలుసు రెండు దారులు వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలి, ఏంతవరకు వెళ్ళాలి అని మార్గాలు తెలుసు. అందుకే ఈ రోజుల్లో పిల్లలు లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే ఇప్పటివరకు ఎంత మందికి లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నారు. మనలో చాలామంది ఉదయం షాప్ తెరవాలి. సాయంత్రం షాప్ మూయాలి. ఇంటికి కావలిసిన పది రూపాయలు

సంపాదించుకోవడంమే లక్ష్యంగా బ్రతుకుతున్నారు. కానీ నేను నెలకు ఏంత లక్ష్యం పెట్టుకున్నాను. నెలకు నేను రెండు, మూడు లక్షలు సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకొని దానికోసం పని చేసే వాళ్ళు మొత్తం ఫోటోగ్రాఫర్లు వంద మందిని తీసుకుంటే 5 నుండి 10 మంది వరకు మాత్రమే ఉంటారు. మిగతా 90 మంది లక్ష్యాలు లేకుండా బ్రతుకుతున్నారు. ఈ రోజు మనం బస్సులో వెళ్తుంటే ఎవరో ఒక అపరిచిత వ్యక్తి (కండక్టర్) మన దగ్గరికి వచ్చి ఏం అడుగుతాడు

మొదటగా టికెట్ అడగడు, డబ్బులు అడగడు మీరు ఎక్కడకు వెళ్తారు అని అడుగుతాడు. గంట సేపు ప్రయాణం చేసే బస్సులోనే ఒక వ్యక్తి మిమ్మల్ని పట్టుకొని బాస్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంటే, జీవితం అనే ప్రయాణంలో బిజినెస్ అనే లైఫ్ దాంట్లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్న లక్ష్యం పెట్టుకోక పొతే మీరు ఎలా బ్రతుకుతారు. మీ ఇంట్లో మాత్రం లక్ష్యాలు ఉన్నాయి. నెల వచ్చే సరికి ఇంటి అద్దె కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంట్లో అవసరాలకు ఖర్చు పెట్టాలి, వీటన్నింటికి లక్ష్యాలు ఉన్నాయి. కానీ మీరు ఎంత సంపాదించాలి. మీరు ఎంత కష్టపడాలి అని ఆ లక్ష్యాలని మీరు పెట్టుకోకుండా పిల్లలకూ మాత్రం మీరు స్పూర్తిని ఇచ్చే విధంగా మీరు లక్ష్యాలు పెట్టుకోండి అని ఎదగండి అని చెప్తారే గాని మీరెప్పుడు లక్ష్యాలు పెట్టుకోరెందుకండి. అందుకే FIX YOUR TARGETS ఇదే మూడవ మంత్ర.

ఈ రోజు నుండి ఈ మూడు సక్సెస్ మంత్రాస్ కనుక మీరు పాటించినట్లయితే మీరు ఉన్నత స్థానానికి ఖచ్చితంగా చేరుకుంటారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow