" అలివేణి ఆణిముత్యమా " టైటిల్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : నగరానికి చెందిన ప్రముఖ స్వచ్చంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ మరియు డిజిటల్ వీడియోస్ వారి సంయుక్త నిర్మాణం లో రాబ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారి రచన దర్శకత్వం లో త్వరలో షూటింగ్ జరగబోయే " అలివేణి ఆణిముత్యమా " లఘు చిత్రం టైటిల్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : నగరానికి చెందిన ప్రముఖ స్వచ్చంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ మరియు డిజిటల్ వీడియోస్ వారి సంయుక్త నిర్మాణం లో రాబ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారి రచన దర్శకత్వం లో త్వరలో షూటింగ్ జరగబోయే " అలివేణి ఆణిముత్యమా " లఘు చిత్రం టైటిల్ ఆవిష్కరణ ఈరోజు స్థానిక అడ్మిన్ ఆఫీస్ లో శ్రీరామ నవమి సందర్బంగా అంగరంగ వైభవంగా జరిపారు . ఈ సందర్బంగా దర్శకుడు మణి భూషణ్ మాట్లాడుతూ శ్రీ రామ నవమి అతి పవిత్రమైన పండగ దినం , ప్రేమకు గౌరవం ఇచ్చిన దినం , సీత రాముల కళ్యాణం సకల మానవాళి మనుగడకు నిరంతరం స్ఫూర్తినిచ్చే ఆనందకర సంబరం, అందుకే నిత్య కల్యాణ రాముడు ప్రేమను పంచె జగదానంద కారకుడు. శ్రీ రాముని చరిత్ర చూస్తే ప్రతి క్షణం రాముడు ఎదుటివారి ప్రేమకు ఎనలేని గౌరవం ఇచ్చాడు , అమ్మ కౌసల్యకు , నాన్న దశరధునికి , పినతల్లి కైకేయకి , గురువు విశ్వామిత్రునికి , తమ్ముడు భరతుడికి , దాసి మందరకి , స్నేహితుడు సుగ్రీవునికి , భక్తుడు ఆంజనేయునికి , శత్రువు రావణాసురుడికి , విధేయుడు విభీషనుడికి , భక్తురాలు సబరికి , వేచిచూసే అహల్యకి , సాయమందించిన వానరులకు , ఉడతకు , వారధి నిర్మించిన అంగదుడుకి , భాద్యతనెరిగిన జటాయువుకి, ప్రాణం కన్నా విలువైంది శ్రీరాముని పాదపద్మములు అన్న సీతమ్మ తల్లి అజరామరమైన ప్రేమకి ఎనలేని గౌరవమిచ్చిన కథ రామాయణం ...అలాంటి సందేశాత్మక కథ తో త్వరలో రాబోతున్న లఘు చిత్రం, ఇది ప్రేమను గౌరవించే అందమైన శబ్ద దృశ్య కావ్యంగా తయారు కాబోతున్న "అలివేణి ఆణిముత్యమా " టైటిల్ ఈ శుభదినమున రిలీజ్ చెయ్యడం చాలా ఆనందం కలిగిస్తున్నదని తెలిపారు . ఈ చిత్రంలో నూతన నటీనటులకు ఉచిత శిక్షణ ఇచ్చి నటన అవకాశం ఇస్తున్నామని, ఏ వయసువారైనా ఈ అవకాశం వినియోగించుకోవచ్చని, వివరాలకు 9848418582 ద్వారా సంప్రదించాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమం లో సీఈఓ సీతారామ స్వామి , ఎడిటర్ నీరజభూషన్ , హీరో ప్రొడ్యూసర్ ఆదిత్యభూషణ్, కెమరామెన్ కిషోర్ తదితరులు హాజరయ్యారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?