ఆస్కార్‌లో తెలుగోడి సత్తా.. ఆవార్డుతో RRR చరిత్ర.. కార్తికేయదే అని చెప్పిన కీరవాణి
ఫోటోస్పాట్ : భారతీయ సినిమా ప్రేక్షకుడు కలలు కన్న సమయం నిజమైంది. అందరూ ఊహించినట్టే RRR సినిమాలోని నాటు నాటు పాట అంతర్జాతీయ సినీ వేదికపై సత్తా చాటింది
ఫోటోస్పాట్ : భారతీయ సినిమా ప్రేక్షకుడు కలలు కన్న సమయం నిజమైంది. అందరూ ఊహించినట్టే RRR సినిమాలోని నాటు నాటు పాట అంతర్జాతీయ సినీ వేదికపై సత్తా చాటింది. అగ్ర నటులు, భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడుతూ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొన్నది. అమెరికాలో అట్టహాసంగా జరిగిన వేడుకలో RRR చిత్రాన్ని ఆస్కార్ వరించింది. ఆస్కార్ అవార్డు అందుకొన్న సమయంలో కీరవాణి ఉద్వేగంగా ప్రసంగం సాగింది ,థ్యాంక్యూ అకాడమీ. నేను ఎంతో మంది సంగీతాన్ని వింటూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్‌తో మీ ముందు నిలుచున్నాను. రాజమౌళి, నా ఫ్యామిలీకి ఖ్యాతి దక్కడం ఆనందంగా ఉంది. భారతీయులందరికీ నాటు నాటు పాట గర్వంగా నిలిచింది. ఈ కలను సాకారం చేసిన కార్తీకేయకు నా థ్యాంక్స్ అని కీరవాణి ఎమోషనల్ అయ్యారు చంద్ర బోస్ మాట్లాడుతూ ఎక్కడో పుట్టి అంటూ మొదలైన నా ''మా '' ఈ ప్రయాణం నాటు నాటు వరకు సాగి ఈ రోజు ఇంతటి ఘనత ను తీసుకొచ్చినదుకు కీరవాణి గారి ధన్యవాదాలు అంటూ చాల ఎమోషనల్ అయ్యారు , ప్రపంచవ్యాప్తంగా దిగ్జజ సినీ ప్రముఖులు రూపొందించిన ఆల్బమ్స్‌తో RRR చిత్రంలోని పాట పోటీ పడింది. లేడి గాగ పాడిన హోల్డ్ మై హ్యాండ్, రిహన్నా పడిన లిఫ్ట్ మీ అప్, మిట్ స్కీ పాడిన ఆప్లాజ్ పాటల సరసన నాటు నాటు నిలిచింది. ప్రపంచ స్థాయి దిగ్గజాల పాటతో పోటీ పడుతూ నాటు నాటు ఆస్కార్ కిరిటాన్ని సాధించింది.95 అకాడమీ వేదికపై ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు పాటకు అవార్డు ప్రకటించారు. దాంతో సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ వేదికపైకి వెళ్లగానే.. ఆడిటోరియం దద్దరిల్లేలా చప్పట్లు కొట్టారు. స్టాండింగ్ ఓవేషన్‌తో వారిని అభినందించారు. సంగీత ప్రియుల కరధ్వనుల మధ్య కీరవాణి, చంద్రబోస్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం కాలభైరవ రాహుల్ సిప్లిగంగ్ స్టేజి పై పాట పాడి అందరిని అలరించారు https://twitter.com/Variety/status/1635092891189014535?s=20
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?