తెనాలి అసోసియేషన్ కొత్త కార్యవర్గం నియామకం
తెనాలి లో ది ఆంధ్రా ప్యారిస్ వీడియో & ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ప్రారంభోత్సవ సభ ఘనంగా జరిగింది
తెనాలి లో ది ఆంధ్రా ప్యారిస్ వీడియో & ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ప్రారంభోత్సవ సభ ఘనంగా జరిగింది
తెనాలి లోని జ్యోతి ఫర్నిచర్ బ్యాంక్వేట్ హాల్ సుల్తానాబాద్ లో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ది ఆంధ్రా ప్యారిస్ వీడియో & ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి (Regd. No. 379/2025) యొక్క నూతన ప్రారంభోత్సవ సభ విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సాంబశివరావు గారు,
మరియు ప్రసాద్ ల్యాబ్ అధినేత శ్రీ ప్రసాద్ గారు హాజరై, ఫోటోగ్రాఫర్స్ సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవం గురించి విలువైన సందేశం అందించారు.
కార్యక్రమంలో సి.ఐ సాంబశివరావు గారు అసోసియేషన్ లోగోను ఆవిష్కరించగా,
శ్రీ ప్రసాద్ గారు అసోసియేషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,
“ఫోటోగ్రాఫర్స్ సమాజానికి కళ్లులాంటివారు , వారి కృషి లేకుండా ప్రతి ఆనంద క్షణం అసంపూర్ణం అవుతుంది అన్నారు.
ఫోటో, వీడియో వృత్తి కూడా గౌరవప్రదమైన సేవ — దీనిని కాపాడటానికి అసోసియేషన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి, అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ కొత్త కార్యవర్గం నియామకం జరిగింది
వ్యవస్థాపక అధ్యక్షుడు: పిల్లి ఫ్రాంక్లిన్ బాబు
అధ్యక్షుడు: కాళిదాసు చైతన్య
సెక్రటరీ: గ్లోరియస్ నాగరాజు
వైస్ ప్రెసిడెంట్: ఆనంద్ డిసౌజా
జాయింట్ సెక్రటరీ: షేక్ రఫీ
ట్రెజరర్: కొల్లి భరత్ కుమార్
పిఆర్‌ఓ: U.నాగ గోవర్ధనరావు
అలాగే గౌరవ సలహాదారులుగా ఎస్.కె. కాలేషా, NM డిజిటల్స్ గిరీష్, NRT శ్రీనివాసరావు లు నియమితులయ్యారు.
ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశ్యం ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంక్షేమం కోసం పనిచేయడం, ప్రతి సభ్యునికి ఐడీ కార్డ్ తో పాటు రూ.10 లక్షల విలువైన రెండు సంవత్సరాల ప్రమాద బీమా అందించడం, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫోటో & వీడియో అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించడం, మరియు సోనీ, కానన్, నికాన్ వంటి కంపెనీలతో వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో ప్రయోజనకరమైన కార్యక్రమాలతో ముందుకు వెళతాం అని అధ్యక్షులు చైతన్య వివరించగా
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అన్ని ఫోటోగ్రఫీ సహోద్యోగులకు, మీడియా మిత్రులకు, మరియు హాజరైన అతిథులకు సెక్రటరీ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి విజయ సారధి బాబు సభాధ్యక్షత వహించగా ssv శేఖర్, రాజు, శ్రీకాంత్ ,శివ సాగర్, సూర్య, బాజీ తదితరులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










