విశాఖలో ఫోటో ట్రేడ్ షో–2026కు ఎంపీ శ్రీ భరత్‌కు ప్రత్యేక ఆహ్వానం
ఫోటోస్పాట్ : ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ & వీడియోగ్రఫీ అసోసియేషన్ – విశాఖపట్నం ఆధ్వర్యంలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ ఎక్స్‌పో (ఫోటో ట్రేడ్ షో – 2026) కు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ గారిని ప్రత్యేక ఆహ్వానంతో ఆహ్వానించారు.
ఫోటోస్పాట్ : ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ & వీడియోగ్రఫీ అసోసియేషన్ – విశాఖపట్నం ఆధ్వర్యంలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ ఎక్స్‌పో (ఫోటో ట్రేడ్ షో – 2026) కు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ గారిని ప్రత్యేక ఆహ్వానంతో ఆహ్వానించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మట్టా లోకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి చల్ల నూకరాజు, ఉపాధ్యక్షులు జై గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మణి రెడ్డితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ఎంపీ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని, ఎక్స్‌పో వివరాలను తెలియజేశారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలు, ట్రెండ్స్‌ను ఒకే వేదికపై పరిచయం చేసే ఈ ఎక్స్‌పోకు ఎంపీ గారి ఆశీస్సులు, సహకారం అందించాలని కోరారు.ఈ మూడు రోజుల ఫోటో ట్రేడ్ షోలో దేశవ్యాప్తంగా పేరుగాంచిన పలు కంపెనీల స్టాల్స్, నూతన కెమెరా గియర్స్ ప్రదర్శనలు, లైవ్ డెమోస్, టెక్నికల్ సెషన్లు, ప్రాక్టికల్ వర్క్‌షాప్స్, ప్యానల్ డిస్కషన్లు నిర్వహించనున్నారు. ముఖ్యంగా యువ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఆల్బమ్ డిజైనర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు ఈ ఎక్స్‌పో ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ గారు ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందిస్తూ, విశాఖలో ఇలాంటి ప్రొఫెషనల్ ఈవెంట్స్ జరగడం ఆనందకరమని, ఫోటోగ్రఫీ & మీడియా రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఫోటోగ్రఫీ రంగానికి విశాఖను ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఫోటో ట్రేడ్ షో–2026 నిర్వహిస్తున్నామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా, రాష్ట్ర స్థాయి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










