తెలంగాణ పలు జిల్లాల్లో ఫోటోగ్రఫర్స్ సమిష్టి నిర్ణయం
ఫోటోస్పాట్ : ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల యొక్క ఆరోగ్యం, ఆర్థిక, విలువల దృష్ట్యా ఫోటోగ్రఫీ రంగంలో సమూల మార్పుల కొరకు ముస్తాబాద్ చుట్టుపక్కల గల వివిధ జిల్లాలోని మండలాలు అయినటి వంటి దుబ్బాక, గంభీరావుపేట్, ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, రామాయంపేట, కొనరావుపేట్ లాంటి వివిధ మండలాల నుంచి
ఫోటోస్పాట్ : ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల యొక్క ఆరోగ్యం, ఆర్థిక, విలువల దృష్ట్యా ఫోటోగ్రఫీ రంగంలో సమూల మార్పుల కొరకు ముస్తాబాద్ చుట్టుపక్కల గల వివిధ జిల్లాలోని మండలాలు అయినటి వంటి దుబ్బాక, గంభీరావుపేట్, ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, రామాయంపేట, కొనరావుపేట్ లాంటి వివిధ మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని వృత్తుల వారికి సమయపాలన ఉంటుంది కానీ ఫోటోగ్రాఫర్లకు సమయపాలన లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు, రాత్రి నిద్ర లేకుండా పనిచేయడం వలన ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతున్నారు. అంతేకాకుండా నిద్ర లేకుండా వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి తీవ్ర గాయాల పాలు అవుతున్నారు, కొందరు చనిపోతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైన సమయపాలన పాటించాలని నిర్ణయించడం జరిగింది. ఒకరోజుని రెండు షెడ్యూల్స్ గా చేశారు.మొదటి షెడ్యూల్: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు, రెండోవ షెడ్యూల్: సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు గా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ రాత్రి 12 గంటలు దాటినా తర్వాత కూడా ప్రోగ్రాం తీయాలంటే extra విసిట్ తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయాన్ని అన్ని మండలాల ఫోటోగ్రాఫర్లు నిర్ణయించి ఆమోదించారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?