ఎన్నికల నగరా మ్రోగించిన రాజంపేట – అన్నమయ్య కమిటీ పెద్దల ప్రకటన

ఫోటోస్పాట్ : శ్రీ అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజంపేట డివిజన్ పరిధిలో ఎన్నికల వాతావరణం నెలకొంది. 2023-2025 కాలానికి అధ్యక్షుడిగా సేవలందించిన శ్రీ తుమ్మందుల పుల్లయ్య గారు తన పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో రాజీనామా పత్రాన్ని అసోసియేషన్ కమిటీ పెద్దలకు సమర్పించారు.పదవీ కాలంలో జరిగిన అన్ని నగదు లావాదేవీల వివరాలను సమీక్షించి, అవి కమిటీ పెద్దలకు అందజేశారు.

Oct 11, 2025 - 15:27
 0  78
ఎన్నికల నగరా మ్రోగించిన రాజంపేట – అన్నమయ్య కమిటీ పెద్దల ప్రకటన

ఫోటోస్పాట్ : శ్రీ అన్నమయ్య ఫోటో & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజంపేట డివిజన్ పరిధిలో ఎన్నికల వాతావరణం నెలకొంది. 2023-2025 కాలానికి అధ్యక్షుడిగా సేవలందించిన శ్రీ తుమ్మందుల పుల్లయ్య గారు తన పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో రాజీనామా పత్రాన్ని అసోసియేషన్ కమిటీ పెద్దలకు సమర్పించారు.పదవీ కాలంలో జరిగిన అన్ని నగదు లావాదేవీల వివరాలను సమీక్షించి, అవి కమిటీ పెద్దలకు అందజేశారు. అసోసియేషన్ అభివృద్ధి, సేవల కొనసాగింపునకు కొత్త నాయకత్వాన్ని ఎంచుకోవడానికి కమిటీ సిద్ధమవుతోంది. కమిటీ పెద్దలు తెలియజేసిన ప్రకారం , రాజంపేట డివిజన్ పరిధిలో ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న ఎవరైనా అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను 2025 అక్టోబర్ 16వ తేదీ లోపు సమర్పించవలసిందిగా సూచించారు. ఒకరి కంటే ఎక్కువ మంది తమ అభ్యర్థిత్వాలను సమర్పించినట్లయితే, ఎన్నికల తేదీ మరియు కార్యాచరణపై నిర్ణయం కమిటీ తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఈనాడు స్టూడియో అధినేత శ్రీనివాసులు గారు, గణేష్ స్టూడియో అధినేత నాగేంద్ర గారు, ఏ. ఎం స్టూడియో అధినేత నిషార్ గారు, ప్రసాద్ స్టూడియో అధినేత రఘు గారు, రాయల్స్ స్టూడియో అధినేత రమణ గారు పాల్గొన్నారు. అసోసియేషన్ నాయకత్వం మార్పుతో రాజంపేట ఫోటోగ్రాఫర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow