బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : ఫోటో, వీడియో రంగానికి సంబంధించిన అతిపెద్ద ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం కరీంనగర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు. ఈ వేడుకను కరీంనగర్ జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు

ఫోటోస్పాట్ : ఫోటో, వీడియో రంగానికి సంబంధించిన అతిపెద్ద ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం కరీంనగర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు. ఈ వేడుకను కరీంనగర్ జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవీందర్ గారు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల కోసం అసోసియేషన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలను మంత్రికి వివరించారు. ఫోటోగ్రాఫర్లకు అవసరమైన సాంకేతిక శిక్షణ, ఆర్థిక సహకారం, కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించేందుకు అసోసియేషన్ కృషి చేస్తోందని తెలిపారు. అదేవిధంగా, కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, రాబోయే హైదరాబాద్‌లో జరగబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫోటో, వీడియో టెక్నాలజీ కంపెనీలు, నూతన పరికరాలు, ఆధునిక సాఫ్ట్‌వేర్‌లు, శిక్షణా కార్యక్రమాలు ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించబడతాయని, ఇది తెలంగాణ ఫోటోగ్రాఫర్లకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ – “ఫోటోగ్రఫీ రంగం ఆధునిక టెక్నాలజీతో ముందుకు సాగుతోంది. సృజనాత్మకతకు, టెక్నాలజీకి కలయికగా ఈ రంగం దేశ అభివృద్ధికి తోడ్పడుతోంది. ఫోటోగ్రాఫర్లకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవీందర్ గారు, జిల్లా అధ్యక్షులు తుమ్మ చందు గారు, జిల్లా కోశాధికారి బొంగోని మధుసూదన్ గారు, ముఖ్య సలహాదారులు సొల్లు అజయ్ వర్మ గారు, జాయింట్ సెక్రటరీ ఎండి కాజా గారు, నిషా నిశంకర్, బొల్లం శ్రీకాంత్, బైరి శేఖర్, సాగర్ రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ ఆవిష్కరణ వేడుకలో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. రాబోయే ఎక్స్‌పోలో పాల్గొని తెలంగాణ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






