బోధన్ ఫోటో & వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు
నిజామాబాదు జిల్లా బోధన్‌లో ఫోటో & వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా జరిగాయి. మొత్తం 95 మంది సభ్యులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో
ఫోటోస్పాట్ : నిజామాబాదు జిల్లా బోధన్‌లో ఫోటో & వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా జరిగాయి. మొత్తం 95 మంది సభ్యులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎం. శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షుడిగా ఎం.డి. ఫిరోజ్ గారు ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా వి. సృజన్ గౌడ్, కార్యదర్శులుగా , జి. రాజశేఖర్ గార్లు, క్యాషియర్‌గా జె. భరత్ గారు బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ సెక్రటరీలుగా ఎస్. సెమెన్స్, సోమశంకర్, బి. రాము, ఎం. నర్సింగ్ గార్లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, “సభ్యులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అసోసియేషన్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తాను. ఎటువంటి విభేదాలు లేకుండా మనం ఒక్కటిగా ఉంటూ ఫోటోగ్రాఫర్స్ ఐక్యతను కాపాడుకుందాం” అని పిలుపునిచ్చారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










