మరో ఇండియన్ సినిమా కు ఆస్కార్ ; చరిత్ర సృష్టించిన ఇండియన్ లేడీడైరెక్టర్
ఇండియన్ లేడీ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ తన మొదటి చిత్రంతోనే రికార్డు సృష్టించారు. తను తీసిన మొదటి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలోని ది ఎలిఫెంట్ విస్పరర్ ఆస్కార్ అవార్డును దక్కించుకోవడంతో ప్రస్తుతం ఆమె ఎవరు?
ఫోటోస్పాట్ : ఇండియన్ లేడీ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ తన మొదటి చిత్రంతోనే రికార్డు సృష్టించారు. తను తీసిన మొదటి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలోని ది ఎలిఫెంట్ విస్పరర్ ఆస్కార్ అవార్డును దక్కించుకోవడంతో ప్రస్తుతం ఆమె ఎవరు? ఆమె ప్రస్థానం ఏంటి అన్నది? ది ఎలిఫెంట్ విస్పరర్ కథేమిటి? అన్నది ప్రతి ఒక్కరు ఆసక్తిగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ది ఎలిఫెంట్ విస్పరర్.. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో 2023 సంవత్సరానికి భారతదేశం ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. నెట్ ఫ్లిక్స్ ను ఊపేసిన ది ఎలిఫెంట్ విస్పరర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది తమిళనాడుకు చెందిన కార్తీకి గోన్సాల్వేస్. దీనిని నిర్మించింది గునీత్ మోంగా. కార్తీకి గోన్సాల్వేస్ తన తొలి చిత్రంతోనే చరిత్ర సృష్టించింది. ది ఎలిఫెంట్ విస్పరర్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింతో ఆమె ఒంటరైన ఏనుగు పిల్లకు ఒక కుటుంబంతో ఉన్న బాండింగ్ ను ఎంతో హృద్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆమె అకాడమీ సభ్యులను మెప్పించారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?