మచిలీపట్నం ప్రాంత వాసికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్
ఫోటోస్పాట్ : ఈరోజు న్యూఢిల్లీలో మన మచిలీపట్నం ప్రాంత వాసి పోతన ఓం ప్రకాష్ గారికి ఈటీవీలో ప్రసారం అవుతున్న మనసంతా నువ్వే డైలీ సీరియల్ లో తన ప్రతిభను చాటుతూ ప్రపంచంలో ఏ కెమెరామెన్ చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయంతో 21 నిమిషాల ఎపిసోడ్ ను సింగల్ టేక్ లో తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ ఉన్న అందర్నీ తన వైపుకు తిరిగి చూసేలాగా వారందరూ
ఫోటోస్పాట్ : ఈరోజు న్యూఢిల్లీలో మన మచిలీపట్నం ప్రాంత వాసి పోతన ఓం ప్రకాష్ గారికి ఈటీవీలో ప్రసారం అవుతున్న మనసంతా నువ్వే డైలీ సీరియల్ లో తన ప్రతిభను చాటుతూ ప్రపంచంలో ఏ కెమెరామెన్ చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయంతో 21 నిమిషాల ఎపిసోడ్ ను సింగల్ టేక్ లో తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ ఉన్న అందర్నీ తన వైపుకు తిరిగి చూసేలాగా వారందరూ చేతమన్ననల్ని పొందిన మన పోతన ఓం ప్రకాష్ గారిని ఈరోజు ఢిల్లీలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వేలాదిమంది సభలో అత్యంత అరుదైన అవార్డును ఓo ప్రకాష్ గారికి అందజేశారు అలాగే పోతన ఓం ప్రకాష్ గారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి టీవీ రంగంలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేస్తూ డైలీ సీరియల్ లో తను ఎంతోమంది శిష్యులను కూడా టీవీ పరిశ్రమకు అందజేశారు కింద స్థాయి నుండి ఈరోజు వరకు ఆధునిక నూతన కెమెరాలతో కూడా అద్భుతమైన కెమెరా పనితనంతో కనులు విందు చేస్తున్నామని తెలియజేశారు అలాగే ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన ఈనాడు టెలివిజన్ చైర్మన్ రామోజీరావు గారికి, ఈటీవీ సీఈఓ బాపినీడు గారికి, మనసంతా నువ్వే డైరెక్టర్ మలినేని రాధాకృష్ణ గారికి, ప్రొడ్యూసర్ గూడూరు శ్రీధర్ గారికి, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ సంఘం కోశాధికారి మరియు MDPWA అధ్యక్షుడు చిలంకుర్తి శేషు పాల్గొన్నారు , ఇంతటి ఘనతను సాదించినందుకు పోతన ఓం ప్రకాష్ గారికి ఎడిట్ పాయింట్ ఇండియా ఫౌండర్ అండ్ చైర్మన్ డా . ఇప్పలపల్లి రమేష్ గారు అభినందించారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?