ఫోటోషాప్ లో స్మార్ట్ ఆబ్జెక్

ఫోటోస్పాట్: ఫోటోషాప్ లో స్మార్ట్ ఆబ్జెక్ గురించి: ఫోటోషాప్ అనే పేరు తెలియని వారు మన రంగంలో కనీసం ఒక్కరు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ రోజు మనం చేస్తున్న Photography and Videography లో ఫోటోషాప్ యొక్క ప్రాముఖ్యత అంతవుంది.

Feb 12, 2023 - 10:38
 0  113
ఫోటోషాప్ లో స్మార్ట్ ఆబ్జెక్

ఫోటోస్పాట్: ఫోటోషాప్ లో స్మార్ట్ ఆబ్జెక్ గురించి:  ఫోటోషాప్ అనే పేరు తెలియని వారు మన రంగంలో కనీసం ఒక్కరు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ రోజు మనం చేస్తున్న Photography and Videography లో ఫోటోషాప్ యొక్క ప్రాముఖ్యత అంతవుంది. మరి అంతే స్పీడుగా ఫోటోషాప్ లో versions మారుతూ వస్తున్నాయి, కానీ మనలో చాలా వరకు photoshop 7.0 లేదా CS వరకు మాత్రమే ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా వుందని చెప్పుకోవాలి. కొంతమంది మాత్రమే new version Photoshop ను ఉపయోగిచడం జరుగుతుంది. అలా new version ఉపయోగిస్తున్న వారు వారు తీసిన ఇమేజ్ లో ఏ విధమైన డేటా loss అవ్వకుండా ఇస్తున్నారు. దానికి కారణం అందులో వారికి కావలసిన Photoshop లో ఉన్నటువంటి ముఖ్యమైన command వాడటం ద్వారా ఏ విధమైన క్వాలిటీ loss అవ్వకుండా ఇవ్వడం జరుగుతుంది. new Photoshopలో ఉన్నటువంటి ముఖ్యమైన commands వాడకపోతే Photoshop 7.0 వాడిన, Photoshop CC వాడిన ఏ విధమైన మార్పువుండదు. కనుక Photoshop లో ముఖ్యమైన command smart object గురించి Basic లెవల్ లో తెలుసుకుందాం. ఇది మీకు Photoshop CS3 నుండి కూడా లభ్యమవుతుంది. ఈ అంశంలో మీరు తీసిన ఇమేజ్ ను convert చేస్తే వచ్చే దాని వల్ల ఉపయోగం గురించి ఎలా convert చెయ్యాలి అనే దానిని తెలుసుకుందాం.

Smart Object వల్ల ఉపయోగం:

మనం passport photography, studio photography, wedding photography ఏది చేసినా వాటిని ఎడిటింగ్ చేయాలంటే ముందుగా మనం చేసేది మనకు కావలసిన సైజ్ తీసుకుని దానిలో మనం తీసిన ఫోటోని డ్రా చేసి దానిని ఫోటోషాప్ లో ctrl+T క్లిక్ చేసి మనం తీసుకున్న సైజ్ లలో చిన్నది చేయటం, దానినే మరల పెద్దదిగా చేస్తూ వుంటాం. దీని వలన మీ ఇమేజ్ చిన్నది చేసి enter click చేసి మరల ctrl+t క్లిక్ చేసి పెద్దదిగా చేయటం ద్వారా మీ ఇమేజ్ లో వుండే Data మొత్తం loss అవుతుంది. అలా కాకుండా మీ ఇమేజ్ ను smart object లో convert చేసుకుంటే ctrl+t ద్వారా ఇమేజ్ ను ఎన్నిసార్లు చిన్నది, పెద్దది చేసినా కూడా మీ ఇమేజ్ లో వుండే Data loss అవ్వదు.

మీ ఇమేజ్ ను smart object లోకి convert చేయడం ఎలా ?

Photoshop CS3 కంటే పైన వాడే ఏ version అయినా సరే File menu ని open ద్వారా మీకు కావలసిన ఇమేజ్ ను open చేసుకోవాలి. Open చేసిన తరువాత మీ keyboard F7 క్లిక్ చేయడం ద్వారా లేయర్ pallet open అవుతుంది. దానిలో మీరు open చేసిన ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది. ఆ లేయర్ మీద మీ mouse right button click చేస్తే మీకు convert to smart object అని కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయండి అప్పుడు ఆ ఇమేజ్ మీకు smart object గా convert అవుతుంది. దానిని మీరు ఎడిట్ చేయాలంటే లేయర్ క్రింద భాగాన కనిపిస్తున్న గుర్తును క్లిక్ చేయడం ద్వారా మీకు మరి యొక్క File open అవుతుంది. ఆ File ని మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా edit చేసిన తరువాత ఆ File ను close చేస్తే File save చేయ్యాలా? వద్దా? అని అడుగుతుంది. yes అని క్లిక్ చేయడం ద్వారా మీరు అప్పటివరకు modify చేసినటువంటి మార్పులతో smart object layer లోకి వస్తుంది. ఈ విధంగా చేయడం ద్వారా Data loss అనేది వుండదు. దీనిని మీరు PSD format లో చేసుకోవాలి.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow