శాసనసభపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతులమీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : జనవరి 3, 4, 5 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ శాసనసభపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి చేతులమీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభపతి గారిని ఎక్స్పోకు అధికారికంగా ఆహ్వానించారు.
ఫోటోస్పాట్ : జనవరి 3, 4, 5 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ శాసనసభపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి చేతులమీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభపతి గారిని ఎక్స్పోకు అధికారికంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కార్యవర్గ పెద్దలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు CH. మధు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పోసిన వీరేంద్ర కుమార్, ఉపాధ్యక్షులు శ్రీ చుక్కా లోవ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ప్రగడ చక్ర రావు తదితర నాయకులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం నేతలు మాట్లాడుతూ—ఫోటో ట్రేడ్ ఎక్స్పో ద్వారా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక కెమెరా గియర్స్, లైటింగ్ సిస్టమ్స్, డ్రోన్లు, పోస్ట్-ప్రొడక్షన్ టూల్స్‌ను ప్రత్యక్షంగా పరిచయం చేయనున్నట్లు తెలిపారు. లైవ్ డెమోలు, టెక్నికల్ సెషన్లు, ప్రాక్టికల్ వర్క్‌షాప్స్, ప్యానల్ డిస్కషన్లు వంటి వినూత్న కార్యక్రమాలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాసనసభపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు మాట్లాడుతూ—విశాఖపట్నంలో ఇలాంటి ప్రొఫెషనల్ స్థాయి ఎక్స్పోలు జరగడం హర్షణీయమని, ఫోటోగ్రఫీ & మీడియా రంగం యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. ఈ ఎక్స్పో విజయవంతానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఆల్బమ్ డిజైనర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖను ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్పో ఒక కీలక అడుగుగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










