మనీ మేనేజ్ మెంట్ - సుధీర్ సాండ్ర
ఫోటోస్పాట్ : ప్రపంచంలో చాలా మంది అంటూ ఉంటారు డబ్బు వుండే వాడు ఎప్పుడు పెరుగుతూ డబ్బు సంపాదిస్తూనే ఉన్నాడు, పేదవాడు ఎప్పుడు అలాగే పెదవాడిలగా వుండిపోతున్నాడు అని. కానీ ఇక్కడ తేడా ఏమిటంటే డబ్బు వుండే వాడు తను సంపాదించే ఒక్కోక్క రుపాయిని కూడా తెలివి తేటలతో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అని అలోచించి చేస్తువుంటాడు. కానీ మనం ఏం చేస్తువుంటాము
ఫోటోస్పాట్ : ప్రపంచంలో చాలా మంది అంటూ ఉంటారు డబ్బు వుండే వాడు ఎప్పుడు పెరుగుతూ డబ్బు సంపాదిస్తూనే ఉన్నాడు, పేదవాడు ఎప్పుడు అలాగే పెదవాడిలగా వుండిపోతున్నాడు అని. కానీ ఇక్కడ తేడా ఏమిటంటే డబ్బు వుండే వాడు తను సంపాదించే ఒక్కోక్క రుపాయిని కూడా తెలివి తేటలతో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అని అలోచించి చేస్తువుంటాడు. కానీ మనం ఏం చేస్తువుంటాము అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కానీ, అంతకన్నా తక్కువ వుండే వాళ్ళం కానీ మనము వచ్చిన ఒక రూపాయిని ఖర్చు పెట్టిన తరువాత మిగిలితే 10 పైసలు దాన్ని ఆదా చేస్తూవుంటారు. 100 రూపాయలు సంపాదిస్తే ఒక 70/80 రూపాయలు ఖర్చు పెట్టేసి, ఆ ఒక్క 20 రూపాయలు మిగిలింది కదా దాన్ని ఆదా చేయాలి అని అంటారు. కానీ డబ్బు వుండే వాళ్ళు ఫస్ట్ ఆదా చేసుకొని దాని తరువాత మిగిలింది ఖర్చు చేస్తారు. ఈ రెండింటికి వ్యత్యాసం మనం ముందుగా కనిపెట్టాలి. ముందుగా మనం ఆదా చేయాలి అనుకుంటామో దాని మొత్తం ముందుగా ఇన్వెస్ట్ చేసి మిగితాది మనం ఖర్చు పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం అంటే నెలలో 10 వేలు వస్తున్నాయి అంటే పాలవాడికి, పేపర్ వాడికి, కిరాణం వాడికి ఇంకా మిగతా వారికీ అన్ని ఇచ్చేసి దాని తరువాత మనం ఏమైనా మిగిలితే అప్పుడు మనం 10 రూపాయలు ఆదా చేస్తాము. అలా కాకుండా ఈ రోజు నుంచి ఆ స్ట్రాటజీని మార్చాలి ఈ మనీ management సిస్టంని గాని మనం apply చేస్తే నిజంగా నిజమైన సంపాదన ఏమిటంటే మనకి తెలుస్తుంది.
ముందుగా నిజమైన సంపాదన:
సంపాదించడం ప్రతి ఒక్కరు సంపాదిస్తారు కానీ నిజమైన సంపాదన ఏమిటంటే నేను దానికి అర్ధం చెపుతాను ఒక్క నాలుగు నెలల పాటు మనము ఏ పని చేయకపోయినా కూడా మనకి ఏదైతే జీవితం మనం గడపగలుగుతామో దానికి కావాలిసిన సంపాదన వస్తూ వుంటే అది నిజమైన సంపాదన అంటారు. ఇప్పుడు నేను నెలకు 10 వేలు సంపాదిస్తున్నాను ఖర్చులకి అయిపోతున్నాయి. ఇంకా ఏమి లేవు ఇది పెద్ద విషయం ఏమి కాదు, గతంలో ఒక మాస్టర్ నన్ను ఒక ప్రశ్న అడిగారు “ఎంత జీతం వస్తుంది నీకు అని?" నేను వెంటనే 30 వేలు వస్తున్నాయి మాస్టర్ అని చెప్పాను. 30 వేలు వస్తున్నాయి బాగానే వున్నావా అని మాస్టర్ అడిగారు, నేను బాగానే ఉన్న హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మాస్టర్ అని చెప్పాను, మాస్టర్ ఇప్పుడు నువ్వు ఆలోచించు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ దారిలో ఎక్కడో పడిపోయావు ఆక్సిడెంట్ అయింది అనుకో, కాలో చెయ్యో ఏదో ఒక్కటి విరిగి పోయింది, ఒక్క నాలుగు నెలలు పాటు వర్క్ చేయలేవు. ఇంట్లో కూర్చొని వున్నావు. ఇప్పుడు నీకు డబ్బులు సంపాదించడం ఎలా? జీతం ఎక్కడ నుంచి వస్తుంది అని మాస్టర్ అడిగారు, నేను అన్నాను ఒక రూపాయి కూడా రాదు అని మాస్టర్ కి చెప్పాను. అప్పుడు Realise అయ్యాను. సంపాదన అంటే సంపాదించే 30 వేలు కాదు, నేను ఖాళీగా వున్న రోజులు కూడా ఏదైతే నేను జీవితం గడపాలి అని అనుకుంటున్నానో దానికి కావాలిసిన డబ్బులు వచ్చిన రోజు అది నిజమైన సంపాదన. అంటే ఈ రోజు సంపాదించేది నేను పెట్టుబడిగా పెడితే (ఇన్వెస్ట్ చేస్తే) రేపటి రోజు నేను ఖాళీగా ఉన్న టైం లో నాకు 30 వేలు ఆదాయం వస్తే అది నిజమైన సంపాదన. ఇప్పుడు మీ అందరు కూడా నిజంగా సంపాదిస్తున్నారా? లేకుంటే జస్ట్ పని చేస్తున్నారా? పని చేసేది అయితే అందరు పని చేస్తారు, రోజు కూలికి పని చేస్తే 500 రూపాయలు వస్తాయి. కాని అతని దగ్గర ఒక్క రూపాయి ఉండదు. ఆ రోజు కూలికి వెళ్ళకపోతే ఆ రోజు భోజనం కూడా చేయరు అది సంపాదన కాదు. సంపాదన అంటే ఏంటటే మీరు ఖాళీగా ఉన్న రోజులు కూడా మీరు సంపాదించేది సంపాదన, బాగా అర్ధం చేసుకోండి నేను చెప్పేది అందుకనే ఈరోజు నుంచి మీకు ఒక స్ట్రాటజీ చెపుతాను దానిని అలాగే apply చేయండి గుర్తుపెట్టుకోండి. 100 రూపాయలు మీ దగ్గర ఉన్న రోజు, ఉదాహరణకు మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ 100 రూపాయలు మీరు ఎలా డివైడ్ చేయాలి. ఈ రోజు నేను చెపుతాను, 100 రూపాయిలో 10 శాతం రూపాయలు దీనిని financial ఫ్రీడం అకౌంటు అంటారు, అంటే రేపటి రోజున మనకి financial ఫ్రీడం అంటే డబ్బు మనకి వస్తూ వుండే లాగా మనకి finance వుండాలి, అంటే మనకి ఫ్రీడం వుండాలి. ఫ్రీడం అంటే ఏంటి మనకు అంటూ స్వేచ్ఛ. రేపటి రోజున మనము ఏమి పని చేయకపోయినా స్వేచ్చగా డబ్బులు వచ్చే దానికి మనము ఈ 10 రూపాయిలని కూడా పెట్టాలి, 100 రూపాయిలో 10 శాతం అంటే ఈ 10 రూపాయిలని తీసుకెళ్ళి ఛీటి కడుతారు అలా ఏదైతే భవిష్యత్ ఉంటుందో కొంతమంది insurance కడతారు అలా తీసుకెళ్ళి మీరు దేనిలో అయిన కట్టండి, అంటే 100 రూపాయిలో 10 రూపాయలు మీరు ఇన్వెస్ట్ గా ఖర్చుపెట్టాలి. వందలో పది శాతం పోయింది రిమైనింగ్ 90% లో ఇంకో పది శాతం తీసుకోచ్చి లాంగ్ టర్మ్ సేవింగ్స్ L.T.S అంటారు. అంటే మీరు ఇంకో పది రూపాయలు తీసుకోచ్చి మీరు ఏదైతే కార్ కొనాలనుకుంటున్నారో లేదా ఇల్లు కొనాలనుకుంటున్నారో వాటికీ పెట్టండి లేదా పిల్లల EDUCATION కొరకు పది రూపాయలు ఆదా చేస్తూ ఉండండి. అలా రెండవ పది శాతం ఖర్చు పెట్టండి. ఇప్పటికి 20% ఇక్కడ పోయింది. ఇప్పుడు ఆ 80% లో 55% నేససిటీస్ (అవసరాలు) అంటే మనకు తినడానికి ఖర్చులు గాని, డైలీ వాడకానికి ఖర్చులకు గాని, 55 రూపాయలు దీనికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పది శాతం మీ education కొరకు అంటే మీరు ఏ వృత్తి అంటే ఫోటోగ్రఫీలో ఫోటోగ్రాఫర్ గా ఉన్నప్పుడు దానిలో ఎటువంటి మార్పులు వస్తాయి దాన్ని ఇంకా కొత్తగా ఎలా నేర్చుకోవాలి అనేటువంటి దాని మీద పది రూపాయలు పక్కన పెడుతూ ఉండండి. అంటే ఏదైతే పని చేస్తే income పెరుగుతుందో దాని మీద పెడుతూ ఉండండి. ఇప్పుడు మిగిలిన 15% లో 10% మన ఆనందాల కోసం సినిమాలవొచ్చు, షికార్లు అవ్వొచ్చు, పిల్లల్ని బయిటికి తీసుకెళ్ళడం కావొచ్చు, మన ఆనందాలకోసం మాత్రమే ఈ పది శాతం ఖర్చు పెట్టాలి. చివరిది 5% చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇవ్వడం వందలో 5 రూపాయలు ఏమి ఆలోచించకుండా మనస్పూర్తిగా వెళ్లి దానం చేయండి. ఈ 5 రూపాయలతో మీరు 500 సంపాదిస్తారు అంటే దానంతట అదే మీకు ఏదో రూపంలో దానికి రెట్టింపుతో మీ దగ్గరకు వస్తుంది. ఈ రోజు నుంచి ఈ పద్దతి అలవాటు చేసుకుండి ఇలా అయితే మీరు సంపాదించడం మొదలు పెట్టినట్లే.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?