నాగర్ కర్నూలు జిల్లా మహిళా ఫోటోగ్రాఫర్లకు సన్మానం

ఫోటోస్పాట్ : నాగర్ కర్నూలు జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఫోటోగ్రాఫర్లకు సన్మానం

Mar 5, 2023 - 16:31
Mar 5, 2023 - 16:45
 0  108
నాగర్ కర్నూలు జిల్లా మహిళా ఫోటోగ్రాఫర్లకు సన్మానం

ఫోటోస్పాట్ :  నాగర్ కర్నూలు జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఫోటోగ్రాఫర్లకు సన్మానం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో జిల్లా లోని మహిళా ఫోటోగ్రాఫర్లను జిల్లా మరియు తాలూకా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్ శాంతకుమారి, మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గౌడ్, హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా ఫోటోగ్రాఫర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరించే దశగా ప్రయత్నిస్తానని తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ కల్పన మాట్లాడుతూ ప్రతి మహిళ స్వచ్ఛందంగా బయటికి వచ్చి తమ వృత్తిలో నైపుణ్యాన్ని చాటాలని తెలియజేశారు ప్రతి ఫోటోగ్రాఫర్ తమ ఫ్యామిలీతో మహిళ మహిళా ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని జరుపుకోవాలని తెలియజేశారు. అలాంటప్పుడే ఫోటోగ్రఫీలో ఉండే మహిళలకు భరోసా ఉంటుందని ఆమె తెలిపారు. జిల్లా అధ్యక్షులు నేతాజీ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మహిళా ఫోటోగ్రాఫర్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న జిల్లా కమిటీ తరఫున అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు కార్యదర్శి చంద్రమౌళి , రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నిర్మల,జిల్లా అధ్యక్షులు నేతాజీ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షులు రాఘవులు, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు షబ్బీర్, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, జిల్లాలోని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు, మహిళా ఫోటోగ్రాఫర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

నాగర్ కర్నూల్ శ్రీనివాస్

Sreenu Bushipaga I sreenu Bushipaga I am working as a photographer

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow