పెందుర్తిలో ఫోటో ట్రేడ్ షో బ్రోచర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్, విశాఖపట్నం ఆధ్వర్యంలో పెందుర్తి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్వహించిన బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ బ్రోచర్, జనవరి 3, 4, 5 తేదీలలో వి కన్వెన్షన్, విశాఖపట్నంలో జరగనున్న ఫోటో ట్రేడ్ షోకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని వెల్లడిస్తోంది.
ఫోటోస్పాట్ : ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్, విశాఖపట్నం ఆధ్వర్యంలో పెందుర్తి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్వహించిన బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ బ్రోచర్, జనవరి 3, 4, 5 తేదీలలో వి కన్వెన్షన్, విశాఖపట్నంలో జరగనున్న ఫోటో ట్రేడ్ షోకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని వెల్లడిస్తోంది. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ—ఫోటో ట్రేడ్ షో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఆల్బమ్ డిజైనర్లు మరియు కంటెంట్ క్రియేటర్లకు తాజా టెక్నాలజీని దగ్గరగా అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. లైవ్ డెమోలు, ప్రాక్టికల్ వర్క్‌షాప్స్, టెక్నికల్ సెషన్లు వంటి అంశాలు ఈ ఎక్స్పోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రొఫెషనల్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. విశాఖను ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ రంగానికి కేంద్రంగా నిలబెట్టే దిశగా ఈ ఫోటో ట్రేడ్ షో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










