ఇప్పలపల్లి కి 9 ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ !!
మనోవిజ్ఞ యాత్ర పేరుతొ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సుదీర్ సాండ్ర మరియు డిజిటల్ ఎక్స్పర్ట్ నిఖిల్ గుండాతో 30 రోజుల పాటు 6258 కిలోమీటర్లు ప్రయాణం చేసి 59943 మంది స్టూడెంట్స్ ని మరి అలాగే ప్రజల్ని అవేర్నెస్ కలగజేస్తూ క్రియేటివ్ స్కిల్స్ నేర్పిస్తూ మెంటల్ హెల్త్ యూత్ ఎంపవర్మెంట్ ఇలా వీటన్నిటిమీద డాక్టర్ ఇప్పలపల్లి రమేష్ గారు చైతన్యం కలుగ చేసిన సందర్భంగా 9 ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ వచ్చాయి.
ఫోటోస్పాట్ : 1989 నుండి సామాన్య వీడియో గ్రాఫర్ గా ఇప్పలపల్లి రమేష్ ప్రస్తానం మొదలై ఫోటో గ్రాఫర్ గా, ఎడిటర్ గా, డిజైనర్ గా హార్డ్వేర్ ఇంజనీర్ గా ఎంతో నేర్చుకుని 2003 లో ఎడిట్ పాయింట్ (కంప్లీట్ ఎడిటింగ్ సోలుషన్స్ ) ప్రారంభించారు. ఫోటో మరియు వీడియోగ్రాఫర్లకోసం హార్డ్వేర్ అండ్ ఎడిటింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్‌వేర్ మిక్సింగ్, సరికొత్త ఎఫెక్ట్స్ & ప్రాజెక్ట్స్ సేవలను అందిస్తూ వీడియో ఎడిటర్స్ కి కేరాఫ్ అడ్రస్ లా 2016లో ఎడిట్ పాయింట్ ఇండియా OPC ప్రైవేటు లిమిటెడ్ గా , ఆర్న ఫోటో ఆల్బమ్స్ పేరుతొ ఆల్బం ప్రింటింగ్, ఫోటో స్పాట్ ఫోటోగ్రాఫర్స్ మాస పత్రిక, వెబ్ న్యూస్ పోర్టల్, AJS ఇన్నోవేషన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ట్రైనింగ్స్, ఫోటోఫిన ఫోటో ఇమజింగ్ ఎక్స్పో ఇలా ఫోటో గ్రఫీ రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. ఎడిట్ పాయింట్ కంపనీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఎడిట్ పాయింట్ రమేష్ గా ప్రస్తుతం ఆస్రా (Advocates Association For Social Responsibility And Awareness) సంస్థ కు తెలంగాణా రాష్ట ప్రధాన కార్యదర్శి, పోలీస్ వ్యూ మాస పత్రిక, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఫోరం, యూట్యూబ్ ఛానల్స్ ఫోరం, పద్మశాలి మీడియా వీటికి టెక్నికల్ అడ్వైజర్, ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్, వందే భారత్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మెన్ గా ఇలా పలురకాల స్వచ్చంద సేవాసంఘాలకు సేవలు అందిస్తున్నారు .. ఫోటోగ్రఫీ రంగానికి చేసిన కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం సేవ పురస్కార్ అవార్డు ని అందించింది. అలాగే భారత్ భూషణ్ అవార్డ్ ,ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ ద్వారా వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం, CRPF నుండి ప్రశంశా పత్రం & బుక్ రికార్డ్, సంతోషం సినిమా పత్రిక ద్వారా అవార్డ్స్ , 2016 నుండి 2022 వరకు వరుసగా entrepreneur అవార్డ్స్ , ఆస్రా రికార్డ్, పద్మశాలి భవన్ సత్కారం , WHRO నుండి డాక్టరేట్ ఇంకా స్వచ్చంద సంస్థలు ఎన్నో అవార్డులు అందచేశాయి. అలాగే భారత దేశం లోని ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ల చేతులమీదుగా కొన్నివందల సన్మానాలు అందుకున్నారు. ఇప్పుడు తాజాగా మనోవిజ్ఞ యాత్ర పేరుతొ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సుదీర్ సాండ్ర మరియు డిజిటల్ ఎక్స్పర్ట్ నిఖిల్ గుండాతో 30 రోజుల పాటు 6258 కిలోమీటర్లు ప్రయాణం చేసి 59943 మంది స్టూడెంట్స్ ని మరి అలాగే ప్రజల్ని అవేర్నెస్ కలగజేస్తూ క్రియేటివ్ స్కిల్స్ నేర్పిస్తూ మెంటల్ హెల్త్ యూత్ ఎంపవర్మెంట్ ఇలా వీటన్నిటిమీద డాక్టర్ ఇప్పలపల్లి రమేష్ గారు చైతన్యం కలుగ చేసిన సందర్భంగా 9 ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ వచ్చాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఇప్పలపల్లి రమేష్ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న సమాజంలో స్కిల్స్ నేర్పించి ఎవరికి వారు వారి కాళ్ళ మీద నిలబడేలా ప్రయత్నం జరగాలని ఎడిట్ పాయింట్ ఇండియా ద్వారా ఫోటో గ్రఫీ మరియు ఎడిటింగ్ లో ట్రైనింగ్ ఇస్తున్నామని వారు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.. ఇంకా నా మీద భాద్యత పెరిగింది అని భవిస్తూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కుటుంబ సబ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసారు .. ఈ సందర్భంగా ఎడిట్ పాయింట్ ఇండియా & ఫోటో స్పాట్ టీం , మిత్రులు , ఫోటోగ్రఫీ రంగ ప్రముఖులు అబినందించారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?