ఫోటో ట్రేడ్ ఎక్స్పో కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించిన రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు
ఫోటోస్పాట్ : తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏర్పడి 12 ఏళ్ల తర్వాత ఫోటోగ్రాఫర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడంలో రాష్ట్ర అసోసియేషన్ విజయాన్ని సాధించింది. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంకట్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కే హుసేన్ గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసి ఫోటోగ్రాఫర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను
ఫోటోస్పాట్ : తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏర్పడి 12 ఏళ్ల తర్వాత ఫోటోగ్రాఫర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడంలో రాష్ట్ర అసోసియేషన్ విజయాన్ని సాధించింది. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంకట్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కే హుసేన్ గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసి ఫోటోగ్రాఫర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించారు. అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి నాలుగు ప్రధాన డిమాండ్లను వినిపించారు: కెమెరాలపై 18% GST రీయింబర్స్మెంట్ రూపంలో తిరిగి ఇవ్వాలని, ఎందుకంటే అది ఫోటోగ్రాఫర్లపై ఆర్థిక భారం పెడుతోందని చెప్పారు. ఫోటోగ్రాఫర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో ఫోటో భవనాలు మంజూరు చేయాలని కోరారు. అర్హులైన ఫోటోగ్రాఫర్స్‌కి ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందజేయాలని సూచించారు. అనంతరం, ఈ నెల హైదరాబాద్‌లో జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కే హుసేన్, రాష్ట్ర కోశాధికారి మాధవరెడ్డి రెడ్డి, రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్చార్జి నాగరాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జంగారెడ్డి, FPVA వైస్ ప్రెసిడెంట్ వీరేశ్, రాష్ట్ర I&PRO శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










