ఫోటో ట్రేడ్ ఎక్స్‌పోలో సోనీ ప్రత్యేక సేవలు
ఫోటోస్పాట్ : ఫోటో టెక్, ఎడిట్ పాయింట్ వారి ఆధ్వర్యంలో, తెలంగాణ ఫోటో వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో – 2025 ఈ నెల 19, 20, 21 తేదీల్లో నార్సింగ్ లోని ఓం కన్వెన్షన్ హాల్ లో వైభవంగా జరగనుంది. ఈ ఎక్స్‌పోలో భాగంగా, ప్రతి సంవత్సరం లాగానే సోనీ కంపెనీ ఈసారి కూడా ఫోటోగ్రాఫర్ల కోసం ప్రత్యేక ఫ్రీ సర్వీస్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది.
ఫోటోస్పాట్ : ఫోటో టెక్, ఎడిట్ పాయింట్ వారి ఆధ్వర్యంలో, తెలంగాణ ఫోటో వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో – 2025 ఈ నెల 19, 20, 21 తేదీల్లో నార్సింగ్ లోని ఓం కన్వెన్షన్ హాల్ లో వైభవంగా జరగనుంది. ఈ ఎక్స్‌పోలో భాగంగా, ప్రతి సంవత్సరం లాగానే సోనీ కంపెనీ ఈసారి కూడా ఫోటోగ్రాఫర్ల కోసం ప్రత్యేక ఫ్రీ సర్వీస్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది. సోనీ సేవలలో కెమెరా సెన్సార్ క్లీనింగ్ బాడీ & లెన్స్ క్లీనింగ్ ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొత్తగా ఫర్మ్వేర్ అప్గ్రేడ్ అప్డేట్ సదుపాయం కూడా కల్పించబడనుంది. ఈ సేవలు మూడు రోజులపాటు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఫోటోగ్రాఫర్ తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు, అలాగే సోనీ కంపెనీ యాజమాన్యం కోరుతున్నారు. ఇక ఎక్స్‌పోలో భాగంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగానికి సంబంధించిన తాజా టెక్నాలజీ ప్రదర్శనలు ప్రపంచ ప్రఖ్యాత కెమెరా, లైటింగ్, స్టూడియో ఎక్విప్‌మెంట్ బ్రాండ్ల స్టాల్స్ లైవ్ డెమోలు, వర్క్‌షాప్‌లు, స్పెషల్ ఆఫర్లు నెట్‌వర్కింగ్ & బిజినెస్ అవకాశాలు కూడా ఉండనున్నాయి. నిర్వాహకులు తెలిపారు. ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరికీ ఈ ఎక్స్‌పో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకే వేదికపై సర్వీసులు, టెక్నాలజీ, ఆఫర్లు, మరియు శిక్షణ అందించే అరుదైన అవకాశం ఇది. 6 వరకు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










