కాకినాడ జిల్లా నూతన కార్యవర్గం
ఫోటోస్పాట్: ది ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా 4-1-23 గాంధీనగర్ క్షత్రియ పరిషత్ నందు నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకరణ జరిగింది. కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులుగా పొన్నగంటి శ్రీనివాస్ అధ్యక్షులుగా ...

ఫోటోస్పాట్: ది ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా 4-1-23 గాంధీనగర్ క్షత్రియ పరిషత్ నందు నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకరణ జరిగింది. కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులుగా పొన్నగంటి శ్రీనివాస్ అధ్యక్షులుగా తోట సూర్య సుబ్బారావు ( చంటిబాబు) ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఖమ్రుజమ ( ఖమురు) కోశాధికారిగా పెపకాయల వీరభద్ర రావు ఉప అధ్యక్షులుగా అడబాల రాజేష్ ఉప కార్యదర్శిగా పిట్ల శ్రీను ఆర్గనైజింగ్ కార్యదర్శిగా దేశపల్లి వరహాల రాజు గౌరవ సలహాదారులుగా షేక్ గౌస్ శైలా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ చిక్కాల రామచంద్ర రావు గారు కార్యవర్గం చే ప్రమాణస్వీకారం చేయించినారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన వారు శ్రీ కొని శ్రీను గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు రాజమండ్రి జోన్ గౌరవ అధ్యక్షులు అల్లు బాబి గారు మయూరి శివ గారు రావు& రావు గారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గడ్డం సురేష్ గారు కార్యదర్శి దొరబాబు గారు కోశాధికారి గోపికృష్ణ గారు పి ఆర్ ఓ పిల్లి వంశీ సుధీర్ గారు మరియు కాకినాడ జిల్లాలో ఉన్న ఫోటో వీడియో గ్రాఫర్లు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమం కాకినాడలో ఉన్న నాలుగు అసోసియేషన్ల అధ్యక్షులు మరియు కార్యవర్గ సమక్షంలో జరిగింది కాకినాడ జోన్ ఇన్చార్జిగా శీలమంతుల గౌరీ శంకర్ పిఠాపురం జోన్ ఇంచార్జిగా కాతేటి శ్రీనివాస్ గారు సామర్లకోట పెద్దాపురం జోన్ ఇన్చార్జిగా అడ్డాల చక్రధర్ (చక్రి) తుని జోన్ ఇంచార్జిగా ఉప్పల వెంకట సతీష్ గారు తొండంగి మండలం నియమితులైనారు ఈ సందర్భంగా గౌరవ పెద్దలు వీరిని కూడా సత్కరించబడినది.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






