ఫోటో స్టూడియో లో భారీ అగ్నిప్రమాదం

ఫోటోస్పాట్ : రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలంలో బదనకల్ శ్రీకాంత్ గారి క్రేజీ డిజిటల్ ఫోటో స్టూడియో నిన్న రాత్రి 11 గంటల సమయంలో షాట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమై పోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీకాంత్ ఫోటోగ్రఫీ రంగాన్ని జీవనాధారంగా ఎంచుకొని ఈ మధ్యనే పలు రకాల ప్రింటింగ్

Feb 1, 2024 - 18:58
Feb 1, 2024 - 19:56
 0  509
ఫోటో స్టూడియో లో భారీ అగ్నిప్రమాదం

ఫోటోస్పాట్ : రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలంలో బదనకల్ శ్రీకాంత్ గారి క్రేజీ డిజిటల్ ఫోటో స్టూడియో నిన్న రాత్రి 11 గంటల సమయంలో షాట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమై పోయింది.
నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీకాంత్ ఫోటోగ్రఫీ రంగాన్ని జీవనాధారంగా ఎంచుకొని ఈ మధ్యనే పలు రకాల ప్రింటింగ్ మిషన్లు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఫోటోఫ్రేమ్ వర్క్స్, టీ షర్ట్ ప్రింటింగ్ మిషన్, మగ్ ప్రింటింగ్ మిషన్ ఇలా చాలా రకాల వస్తువులు దాదాపు 5 లక్షల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టి షాప్ పెట్టడం జరిగింది. కానీ నిన్న రాత్రి జరిగిన ప్రమాదం వలన షాపులో ఉన్న వస్తువులతో పాటుగా కంప్యూటర్లు, విలువైన డేటా కలిగిన హార్డ్ డిస్క్ లు, ప్రింటింగ్ కి సంబందించిన ఇతర వస్తువులతో పాటుగా ఫర్నిచర్ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతై పోయాయి. ఈ ప్రమాదం వలన దాదాపు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆకస్మిక ప్రమాదం వలన శ్రీకాంత్ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు, తన కుటుంబం ఆర్థికంగా ఇంకా వెనుకంజులోకి వెళ్లి పోయింది. విషయం తెలియగానే ముస్తాబాద్ మండల ఫోటో&వీడియోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు దుబ్బాక రాజు, కార్యవర్గ సభ్యులు ఈరవేని సతీష్, మాచర్ల మధు, రంజాన్ నరేష్, మాంకాలి వేణు మరియు యూనియన్ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని శ్రీకాంత్ ని కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఆకస్మిక ప్రమాదంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న శ్రీకాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

Arepally Babu Professional Photographer. National Gold medalist in Art Photography.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow