ఫోటోగ్రఫీ వ్యాపారాన్ని పెన్చుకోవడానికి ఒక గైడ్ PETALS బుక్స్ by Ramana villart
ఫోటోస్పాట్ : మీరు టెక్నికల్ గా ఒక మంచి ఫోటోగ్రాఫర్ కావాలి అనుకుంటున్నారా . ఈ పుస్తకం మీకోసం అయితే కాదు . ఒక ఫోటోగ్రాఫర్ ఎలా ఉండాలి ? ఫోటోగ్రాఫర్ నడవడిక ఎలా ఉండాలి ? ఏది తెలియకుంటే ఏమౌతుంది ? అనేదే ఈ పుస్తకం.
ఫోటోస్పాట్ : మీరు టెక్నికల్ గా ఒక మంచి ఫోటోగ్రాఫర్ కావాలి అనుకుంటున్నారా . ఈ పుస్తకం మీకోసం అయితే కాదు . ఒక ఫోటోగ్రాఫర్ ఎలా ఉండాలి ? ఫోటోగ్రాఫర్ నడవడిక ఎలా ఉండాలి ? ఏది తెలియకుంటే ఏమౌతుంది ? అనేదే ఈ పుస్తకం. ఫోటోగ్రఫీ రంగం లో మూడు దశాబ్దాల అనుభవనికి వినూత్నమైన ప్రయత్నాలతో ఫోటోగ్రఫీ లో టెక్నోపెనుమార్పులను అనుసరిస్తూ వారికంటూ ఒక ప్రత్యేక వరవడికను ఏర్పరుచుకున్న రమణ గారు (రమణ విల్లర్ట్ ) గారు వారి 34 ఏళ్లు జీవితం లో ఫోటోగ్రఫీ లో మార్పులు మరియు ఫోటోగ్రాఫర్స్ యొక్క గుణాలపై ఫోటోగ్రఫీ లో అలవారిచిన ప్రయత్నాలు అనుభవించిన అనుభవాలపై వారు తన మొదటి బుక్ జనవరి 2025 లో ఆవిష్కరించనున్నారు. PETALS టైటిల్ తో మీ ఫోటోగ్రఫీ వ్యాపారాన్ని పెన్చుకోవడానికి ఒక గైడ్ అనే టాగ్ లైన్ తో ఈ బుక్ ను అందించనున్నారు ఈ బుక్ లో ఏమి ఉండబోతుందో అనే వారి మాటల్లో ఇలా అన్నారు. ఫోటోగ్రఫీ రంగంలో నా 34 ఏళ్ల ప్రయాణానికి ప్రతిబింబంగా నా మొదటి పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పుస్తకం నా అనుభవాలు, పాఠాలు, మరియు నా కళను తీర్చిదిద్దిన సాంకేతికతల తాలూకు సమాహారం. నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు, ఈ రంగంలోని సవాళ్లను ఎదుర్కోవడంలో మార్గనిర్దేశo చేయగల ఒక మార్గదర్శి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. ఇప్పుడు, ఆ లోటును పూరించేందుకు ఈ పుస్తకం నా ప్రయత్నం. ఇది కనీసం ఒకరి జీవితాన్నైనా మార్చగలిగితే, నా లక్ష్యం నెరవేరినట్లే.ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగస్వాములైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు . ఈ పుస్తకం జనవరి 3,4,5 వ తేదీల్లో మన వైజాగ్ లో వి. కన్వెన్షన్ విశాఖపట్నం ,ఆంధ్రప్రదేశ్ నందు ఫోటో ట్రేడ్ షో 2025 లో అందుబాటులో ఉంటుందని కూడా వారు తెలియజేసారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?