జంట నగరాల్లో ఫోటో ట్రేడ్ ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఫోటో టెక్ & ఎడిట్ పాయింట్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20, 21 తేదీలలో హైదరాబాద్‌లో జరగబోయే భారీ స్థాయి ఫోటో ట్రేడ్ ఎక్సపో – 2025 విజయవంతం

Sep 4, 2025 - 18:30
Sep 4, 2025 - 18:31
 0  394

1. వరంగల్ లో ఫోటో ట్రేడ్ ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ

వరంగల్ లో ఫోటో ట్రేడ్ ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఫోటో టెక్ & ఎడిట్ పాయింట్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20, 21 తేదీలలో హైదరాబాద్‌లో జరగబోయే భారీ స్థాయి ఫోటో ట్రేడ్ ఎక్సపో – 2025 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వరంగల్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పలువురు ఫోటో స్టూడియో యజమానులు, వందలాది ఫోటోగ్రాఫర్లు, యువత మరియు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతూ, కొత్త సాంకేతికతలతో ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు. ఫోటో ట్రేడ్ ఎక్సపోలో అత్యాధునిక కెమెరాలు, లైటింగ్ పరికరాలు, ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లు, ప్రింటింగ్ టెక్నాలజీలు ప్రదర్శనకు రానున్నాయని నిర్వాహకులు తెలిపారు.ఫోటోగ్రాఫర్ల కోసం వర్క్‌షాప్‌లు, సాంకేతిక సెషన్‌లు, ప్రత్యేక డెమోలు కూడా ఈ ఎక్సపోలో ముఖ్య ఆకర్షణలుగా ఉండనున్నాయి. చిన్న స్టూడియో యజమానుల నుండి ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ల వరకు అందరికీ ఈ వేదిక ఎంతో ఉపయోగకరంగా మారనుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు.ఫోటో రంగం అభివృద్ధికి తోడ్పడేలా ప్రతి ఫోటోగ్రాఫర్ ఈ ఎక్సపోలో తప్పనిసరిగా పాల్గొని లాభం పొందాలని వారు పిలుపునిచ్చారు.

2. హన్మకొండలో ఫోటో ట్రేడ్ ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ

హన్మకొండలో ఫోటో ట్రేడ్ ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ :  హన్మకొండ లో ఫోటో ట్రేడ్ ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ . హైదరాబాద్‌లో  భారీ స్థాయి ఫోటో ట్రేడ్ ఎక్సపో – 2025 ను ఈ నెల 19, 20, 21 తేదీలలో నార్సింగ్ ఓం కన్వెన్షన్ హాల్ నందు ఎడిట్ పాయింట్ ఇండియా మరియు ఫోటో టెక్ వారి ఆధ్వర్యం లో, తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారం తో  నిర్వహిచబోతున్నారు . ఈ ఎగ్జిబిషన్ సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణను హన్మకొండ లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కలిసి ఆవిష్కరించారు. ఫోటోగ్రాఫర్ల కోసం వర్క్‌షాప్‌లు, సాంకేతిక సెషన్‌లు, ప్రత్యేక డెమోలు కూడా ఈ ఎక్సపోలో ముఖ్య ఆకర్షణలుగా ఉండనున్నాయి. ఫోటో రంగం అభివృద్ధికి తోడ్పడేలా ప్రతి ఫోటోగ్రాఫర్ ఈ ఎక్సపోలో తప్పనిసరిగా పాల్గొని లాభం పొందాలని వారు పిలుపునిచ్చారు

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow