ప్రముఖుల చే పలు జిల్లాల్లో ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య గారి చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది
1. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చేత ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య గారి చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను, వివిధ అభివృద్ధి చర్యలను మంత్రికి వివరించారు. అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ – హైదరాబాద్‌లో జరగబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్‌పోలో దేశవ్యాప్తంగా ఉన్న ఫోటో, వీడియో టెక్నాలజీ కంపెనీలు, నూతన పరికరాలు, సాఫ్ట్‌వేర్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు ప్రదర్శించబడతాయని, ఇది తెలంగాణ ఫోటోగ్రాఫర్లకు ఒక గొప్ప అవకాశమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ రంగం ఆధునిక టెక్నాలజీతో ముందుకు వెళ్తోందని, ఫోటోగ్రాఫర్లకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ ఎక్స్‌పో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవీందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివలింగం గౌడ్, రాష్ట్ర PRO శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
2. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ చేత ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : జిల్లా ఫోటో & పట్టణ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ గారిని అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్, పోటోటెక్ మరియు ఎడిట్ పాయింట్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరగబోయే PHOTO TRADE EXPO కు సంబంధించిన కార్యక్రమాలను వివరించారు. హైదరాబాద్‌లో జరగబోయే ఈ ఎక్స్‌పోలో పాల్గొని ప్రారంభించాలని ఎంపీ డీకే అరుణమ్మ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కుమ్మరి నరసింహ, ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్, కోశాధికారి అమ్మ బాలచందర్, కుటుంబ భరోసా ఇన్‌చార్జ్ సత్యం మాస్టార్, పట్టణ గౌరవాధ్యక్షులు నర్సప్ప, పట్టణ అధ్యక్షులు అంజి, పట్టణ ప్రధాన కార్యదర్శి రవికుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే సీనియర్ ఫోటోగ్రాఫర్లు రాఘవులు, సత్యం యాదవ్, శివరాజ్, అల్తాఫ్, కృష్ణ, ప్రవీణ్ గౌడ్, బాలగోపీ, పున్నమి ప్రవీణ్, గుబ్బ నరేందర్, పవన్, తైద శీను,రాజేష్, సుదర్శన్ రెడ్డి, అశ్వక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
3. నల్గొండలో ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : నల్గొండ టౌన్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌లోని ఓం కన్వెన్షన్ హాల్‌లో సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో జరగబోయే ఫోటో ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఫోటో ఎక్స్పోలో దేశవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగానికి సంబంధించిన నూతన పరికరాలు, డిజిటల్ టెక్నాలజీలు, సాఫ్ట్‌వేర్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు ప్రదర్శించబడతాయని తెలిపారు. ఇది తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్‌కు ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.కార్యక్రమానికి రాష్ట్ర తెలంగాణ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గంధం రూపేంద్ర కుమార్, సంయుక్త కార్యదర్శి సామల వెంకటేశ్వర్లు, నల్గొండ పట్టణ అధ్యక్షుడు కంభంపాటి రవి, ప్రధాన కార్యదర్శి దాస పత్రి జనార్ధన్, కోశాధికారి పెరిక నాగరాజు, పట్టణ గౌరవ సభ్యులు మరియు కమిటీ సభ్యులు హాజరయ్యారు.
4.
ఫోటోస్పాట్ : జగద్గిరిగుట్ట ఫోటో & వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినెల మొదటి మంగళవారం నిర్వహించే సమావేశం ఈ నెల విజయవంతంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ చారి మాట్లాడుతూ, ఈరోజు ఫోటోగ్రాఫర్లకు ఈఎస్ఐ హెల్త్ కార్డుల పై అవగాహన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంలో దాదాపు 50 మంది కొత్త సభ్యులు అసోసియేషన్‌లో చేరారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఫోటోగ్రాఫర్లకు ఈఎస్ఐ కార్డులను అందించడం ఒక చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగబోయే ఫోటో ఎక్స్‌పో సందర్భంగా అసోసియేషన్ తరపున గోడపత్రికను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లు బాదం ఉమాశంకర్, సిహెచ్. శ్రీనివాస్ సాగర్, కమలాకర్ రెడ్డి, లక్ష్మీకాంత్, విజయ్ రాజు, విజయ్ సాగర్, చంద్రశేఖర్, ఎస్.డి. రాజు, రాఘవేంద్ర చారి, నగేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?







