కాకినాడ రూరల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
ఫోటోస్పాట్ : ది 2-10-2024 బుధవారం కాకినాడ రూరల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు శ్రీ కర్రి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగింది.అజెండాలోని ముఖ్యాంశాల వారీగా సర్వసభ్య సమావేశంలో చర్చించి ఈ క్రింది తెలియజేసిన విధంగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడమైనది
ఫోటోస్పాట్ : ది 2-10-2024 బుధవారం కాకినాడ రూరల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు శ్రీ కర్రి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగింది.అజెండాలోని ముఖ్యాంశాల వారీగా సర్వసభ్య సమావేశంలో చర్చించి ఈ క్రింది తెలియజేసిన విధంగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడమైనది, ముఖ్యాంశాలు , పోస్టల్ ఇన్సూరెన్స్ సభ్యత రుసుము అప్డేట్ కట్టిన వారికి అసోసియేషన్ డబ్బులతో అందరికీ 750/- రూపాయలు ఇన్సూరెన్స్ చేయించడానికి . అసోసియేషన్ సభ్యుల వివరాలతో పాటు, ఫోటో స్టోర్స్ , కెమెరా సర్వీసింగ్ సెంటర్ వివరాలు, మరియు వివాహ సుముహూర్తాల వివరాలతో కూడిన 2025 సంవత్సర నూతన డైరీ( వ్యాపార ప్రకటన నిమిత్తం చెల్లించిన డబ్బులతో) ప్రింట్ చేయుటకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కే.జే.ఎన్. శ్రీనివాసరావు( బుజ్జి) గారు, గౌరవ సలహాదారులు శ్రీ తుమ్మలపల్లి వీర్రాజు గారు, జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ పి. శ్రీనివాస్ గారు జిల్లా కమిటీ మెంబర్ శ్రీ ఎస్. మనోహర్ గారు ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్. శ్రీనివాస బాబు గారు కార్యదర్శి శ్రీ సిహెచ్. రవికుమార్ గారు కోశాధికారి శ్రీ పి.సత్యనారాయణ మూర్తి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ పి. లోవ రాజు గారు పాల్గొన్నారు. ఈ సమావేశం నకు ఏసి ఆడిటోరియం అందించిన శ్రీ అక్బర్ రషీద్ గారికి కార్యవర్గం తరపున ధన్యవాదములు తెలిపారు. అలాగే ఈ సమావేశమునకు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తగిన సూచనలు సలహాలు అందించి కార్యవర్గంలో నూతన ఉత్తేజంతో ముందుకు నడిపిస్తున్న అసోసియేషన్ గౌరవ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?