వైజాగ్ ఫోటో ట్రేడ్ షో–2026 బ్రోచర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : విశాఖపట్నం డైమండ్ పెర్ల్ హోటల్‌లో ఈరోజు వైజాగ్ ఫోటో ట్రేడ్ షో–2026 కు సంబంధించిన బ్రోచర్లను ఘనంగా ఆవిష్కరించారు. జనవరి 3, 4, 5 తేదీలలో వైజాగ్ వి-కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ మహోత్సవానికి ఏర్పాట్లు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫోటోగ్రఫీ రంగం ఎదురుచూస్తున్న ఈ ట్రేడ్ షో ఈసారి మరింత విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, గాజువాక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కు చెందిన ప్రముఖ నాయకులు పాల్గొని బ్రోచర్లను ఆవిష్కరించారు.
ఫోటోస్పాట్ : విశాఖపట్నం డైమండ్ పెర్ల్ హోటల్‌లో ఈరోజు వైజాగ్ ఫోటో ట్రేడ్ షో–2026 కు సంబంధించిన బ్రోచర్లను ఘనంగా ఆవిష్కరించారు. జనవరి 3, 4, 5 తేదీలలో వైజాగ్ వి-కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ మహోత్సవానికి ఏర్పాట్లు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫోటోగ్రఫీ రంగం ఎదురుచూస్తున్న ఈ ట్రేడ్ షో ఈసారి మరింత విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, గాజువాక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కు చెందిన ప్రముఖ నాయకులు పాల్గొని బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫోటో ఎక్స్పో ద్వారా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగంలో తాజా ట్రెండ్స్, అధునాతన పరికరాలు, నూతన టెక్నాలజీ, మార్కెట్ డెవలప్మెంట్స్ అన్నీ ఒకేచోట అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఫోటోగ్రఫీ రంగంలో ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా, కొత్తగా అడుగుపెడుతున్న యువతకు ఈ ట్రేడ్ షో గొప్ప అవకాశాన్ని ఇవ్వనుంది. అధునాతన కెమెరాలు, లెన్సులు, లైటింగ్ పరికరాలు, ప్రింటింగ్ సొల్యూషన్స్, ఆల్ఱియల్ డ్రోన్స్, AI ఆధారిత ఎడిటింగ్ టెక్నిక్‌లు, ఆల్బమ్ సాఫ్ట్‌వేర్‌లు వంటి అనేక సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దీంతో ఒకే వేదికపై ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం, మార్గదర్శకత్వం, వ్యాపార అవగాహన అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఈ మూడు రోజుల ఎక్స్పోలో వివిధ సంస్థలు వర్క్‌షాప్‌లు, టెక్నికల్ సెమినార్లు, లైవ్ డెమోస్, ప్రొఫెషనల్ ఇన్టరాక్షన్ సెషన్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇవన్నీ ఫోటోగ్రాఫర్ల నైపుణ్యాభివృద్ధికి దోహదం చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు శేష రాష్ట్రాల ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, స్టూడియో ప్రొఫెషనల్స్, వ్యాపారులు మరియు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఈ PHOTO TRADE SHOW–2026 లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాము. ఇది ప్రతి ఫోటోగ్రాఫర్‌కు సంవత్సరంలో ఒక పెద్ద ఉత్సవం వంటి కార్యక్రమం” అని పేర్కొన్నారు. నిర్వాహకులు తెలిపారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










