ఫోటో ఫినా ఎక్స్ పో ఏప్రిల్ లో

ఫోటో స్పాట్ : తెలంగాణాలో ఫోటోఫిన 20 వ ట్రేడ్ ఎక్స్ పోలో ఈ సారి ప్రత్యేక ఆకర్షణ. తొలిసారిగా ఫిల్మ్ & బ్రాడ్‌కాస్ట్ ఎక్స్‌పోను మన ఎడిట్ పాయింట్ హైదరాబాద్ లో 2023 ఏప్రిల్ నెల 27 నుండి 29 తేదీలలో ఫోటోఫిన 21 వ ట్రేడ్ ఎక్స్ పోలో నిర్వహిస్తుంది.

Feb 9, 2023 - 13:30
Feb 11, 2023 - 17:01
 0  111
ఫోటో ఫినా ఎక్స్ పో ఏప్రిల్ లో

ఫోటో స్పాట్ :  అంతర్జాతీయ ఫోటోఫిన ఎక్స్ పో 2023 , ఏప్రిల్ 27 నుంచి 29 వరకు ది  అడ్రెస్ కన్వెన్షన్ , నార్సింగి , ఎడిట్ పాయింట్ ఇండియా తన 20వ ఎడిషన్  ఫోటోఫిన ఎక్స్ పో ను తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో  ఏప్రిల్ 27, 28, 29 తేదిలలో నార్సింగి  లోని ది  అడ్రెస్ కన్వెన్షన్ లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) మరియు వందే భారత్ ట్రస్ట్ సహకారం తో  నిర్వహిస్తున్నట్లు  డా. ఇప్పలపల్లి రమేష్ తెలియచేసారు.  ఇప్పలపల్లి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల ఫోటో, వీడియోగ్రాఫర్లకు, ట్రేడర్స్ కి ఎన్నో సేవలు అందిస్తున్న ఎడిట్ పాయింట్ ఇండియా తన 20వ ఎడిషన్  ఫోటోఫిన ఎక్స్ పో ను  ఏప్రిల్ 27, 28, 29 తేదిలలో నార్సింగి  లోని ది  అడ్రెస్ కన్వెన్షన్ లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) మరియు వందే భారత్ ట్రస్ట్ సహకారం తో  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  9 ఎకరాల సువిశాల ప్రాంగణం, 500కి పైగా ప్రముఖ కంపెనీలు అత్యంత టెక్నికల్ వాల్యూస్ తో ఫోటోఫిన ఎక్స్ పో ఏర్పాటు చేశామన్నారు.

మొట్టమొదటి సారిగా ఫిల్మ్ & బ్రాడ్ కాస్ట్ రంగానికి చెందిన ఉత్పత్తులతో పాటుగా  ప్రోడక్ట్ డెమోలు, వర్క్ షాపులు, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ కి సంబందించి, ప్రముఖ ఫోటోగ్రాఫర్లని కలిసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఫోటోఫిన ఎక్స్పో అందించటం జరుగుతుందన్నారు. ఫోటోఫిన ఎక్స్ పో లో భిన్న సంస్కృతి ని ప్రతిబంబించేలా రకరకాల ఫుడ్స్ ఎక్స్ పోలో కనువిందు చేయనున్నాయని వివరించారు హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున జరిగే ఈ ఎక్స్ పో కు దేశం నలుమూలలు నుండి ఫోటో, వీడియో గ్రాఫర్స్, ఎక్సిబిటర్స్ హాజరుకానున్నారని  వెల్లడించారు. రాజకీయ, క్రీడా, ఫాషన్, సినీ మొదలగు రంగాలనుండి ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొనబోతున్నారు. సినిమా , టీవీ , మీడియా , ఎడ్యుకేషన్ , హెల్త్ కేర్ , బిజినెస్ , మ్యూజిక్ , ఫుడ్ , ఇన్నోవేషన్ మరియు  ఎన్నో రకాల సేవలు అందిస్తున్న  NGO ఆర్గనైజేషన్స్  లో  నిష్ణాతులు అయినటువంటి  తొమ్మిది రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ ఎక్స్పో లో "వందే భారత్ సేవ పురస్కార్ అవార్డ్స్"  ప్రధానం చేయనున్నామని పేర్కొన్నారు.అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ ఎక్స్పో కి కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, వచ్చే స్టాల్ నిర్వహకులకు, విజిటర్లకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాము అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఫోటోఫిన, ఫోటో వీడియో ఇమేజింగ్ ఎక్స్పో కు విజిటర్ పాస్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.

www.photofina.in

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow