ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా

ఫోటోస్పాట్ : ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా.. 25 కి.మీ దూరంలోని గోల్ఫ్‌ బంతి స్పష్టంగా గుర్తింపు.. ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా.. ఐదున్నర అడుగుల లెన్స్‌.. అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుంది. ఈ లెన్స్‌ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్‌ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు.

Feb 9, 2023 - 13:44
Feb 11, 2023 - 17:01
 0  53
ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా

ఫోటోస్పాట్ : ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా.. 25 కి.మీ దూరంలోని గోల్ఫ్‌ బంతి స్పష్టంగా గుర్తింపు..

ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా.. ఐదున్నర అడుగుల లెన్స్‌.. అంటే ఓ చిన్నపాటి కారు సైజులో ఉంటుంది. ఈ లెన్స్‌ 25 కిలోమీటర్ల దూరంలోని గోల్ఫ్‌ బంతిని కూడా స్పష్టంగా గుర్తించగలదు.

ఈ డిజిటల్‌ కెమెరా 3,200 మెగాపిక్సెల్‌ సామర్థ్యం కలిగి ఉంది. రాత్రి వేళల్లో ఖగోళ చిత్రాలను కచ్చితత్వంతో చిత్రీకరించడం కోసం దీన్ని తయారు చేస్తున్నారు. దాదాపుగా పూర్తైన ఈ కెమెరా ఫొటోలను ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు.

ఈ కెమెరాను వచ్చే ఏడాది చిలీలోని ఓ పర్వతంపై కూర్చొబెడతారు. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని కెమెరాను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పా రు. ఆకాశంలో రాత్రి వేళల్లో జరిగే అద్భుతాలు, రహస్యాలను తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సాధారణంగా మనం దిగే ఫొటోలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో.. ఈ కెమెరా ఫొటోలు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారుు. కెమెరా ముందుభాగంలో ఉండే అద్దం 27 అడుగులు ఉంటుంది. అంటే టెన్నిస్‌ సింగిల్స్‌ కోర్టు సైజులో ఉంటుంది. 189 సెన్సర్లు కలిగి ఉంటుంది. 2800 కిలోల బరువు ఉంటుంది.

Editors Shop : https://editpointindia.com/

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow