ఫోటోగ్రఫీ కళమ్మ తల్లి సేవలో మూడుతరాల వారసులు
ఫోటోస్పాట్ : 95 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగం తమ జీవితాన్ని సాగిస్తున్న మూడుతరాల వారసులు , ఫాదర్ అఫ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ ట్విన్ సిటీస్ గా బిరుదుని సంపాదించుకున్న శ్రీ పరికిపండ్ల వీరయ్య గారు . వీరు 1929 లో ఫోటోగ్రఫీ రంగం లో అడుగు పెట్టి నేటికీ 95 సంవత్సరాలు పూర్తి కావస్తుంది ,

ఫోటోస్పాట్ : 95 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగం తమ జీవితాన్ని సాగిస్తున్న మూడుతరాల వారసులు , ఫాదర్ అఫ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ ట్విన్ సిటీస్ గా బిరుదుని సంపాదించుకున్న శ్రీ పరికిపండ్ల వీరయ్య గారు . వీరు 1929 లో ఫోటోగ్రఫీ రంగం లో అడుగు పెట్టి నేటికీ 95 సంవత్సరాలు పూర్తి కావస్తుంది , వీరు 1929 లో జిల్లా బచ్చయ్య మరియు ప్రముఖ మిలటరీ ఫోటోగ్రాఫర్ ఆళ్వాన్ డికర్ గార్లచే ఫోటోగ్రఫీ నేర్చుకున్న వీరు అతి కొద్దీ సమయం లోనే రెండు జంట నగరాలలో మంచి పేరును సంపాదించుకొని ఫాదర్ అఫ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ ట్విన్ సిటీస్ గా బిరుదుని అందుకున్నారు . టెక్నాలజీ లేని రోజుల్లోనే ఫోటోగ్రఫీ లో తనదైన శైలిలో అందంగా చిత్రీకరించిన ఫొటోస్ ఇప్పటికి ఒక మహా అద్భుతం . అంతటి ఘనతను సంపాదించి మరణించిన అనంతరం వారి కుమారుడుP.G RAO( పరికిపండ్ల జ్ఞానేశ్వర్ రావు ) గారు వారి తండ్రి బాధ్యతని తీసుకోని అటు ఫోటోగ్రఫీ మరియు హ్యాండ్ పెయింటింగ్ రంగం లో ఎన్నో అద్భుతాలు చేసారు వారు ఇప్పటికి ఈ రెండు రంగాల్లో తనదైన గుర్తింపును ఉంచుతూనే వారి కుమారులు పరికిపండ్ల వివేక్ మరియు విక్రమ్ ను సైతం ఫోటోగ్రఫీ రంగానికే అంకితం చేసారు . ఇలా మూడుతరాల ఫోటోగ్రఫీ రంగం లో ప్రముఖ పాత్ర పోషించిన వీరు ఈ నెల 25 వ తేదీన ఫోటోగ్రఫీ రంగం ప్రవేశించి 95 సంవత్సరాలు అవుతున్న తరుణం లో శ్రీ పరికిపండ్ల వీరయ్య గారు స్మరించుకుంటూ ఎగ్జిబిషన్ అఫ్ ఫోటోగ్రాఫ్స్ & పెయింటింగ్ బై 3 జనరేషన్ పేరిట నెహురు ఆర్ట్ గేలరీ JNAFAU మాసాబ్ ట్యాంక్ నందు హైదరాబాద్ నందు ఎగ్జిబిషన్ ని నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ లో వారి తండ్రి గారి మొదలుకొని వారి కుమారులు వరకు వారు తీసిన ఫొటోస్ మరియు వారు పొందిన అవార్డ్స్ ను ఈ ఎగ్జిబిషన్ లో పొందుపరచనున్నారు . అనంతరం , ఫాదర్ అఫ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ ట్విన్ సిటీస్ శ్రీ పరికిపండ్ల వీరయ్య స్మరించుకొని బయోగ్రఫీ అఫ్ శ్రీ పరికిపండ్ల వీరయ్య బుక్ ను ఆవిష్కరించనున్నారు . ఇంతటి ఘనత కలిగిన ఈ ఎగ్జిబిషన్ కు అందరు హాజరు కావాలి అని వారు కోరారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






