విజయవంతమైన రంగారెడ్డి ఫోటోగ్రాఫర్ల జిల్లా మహాసభ
ఫోటోస్పాట్ : రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా నిన్న శంషాబాద్ లో ఫోటోగ్రాఫర్ల జిల్లా మహాసభను నిర్వహించారు , ఈ సభ ద్వారా ఫోటోగ్రాఫర్ ఎదుర్కొంటున్న సమస్యలను మరియు ఫోటోగ్రాఫర్ల యొక్క డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు ఈ యొక్క జిల్లా మహాసభ దోహదం చేస్తుందని భావించి రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల ఫోటోగ్రఫీ ఈ సభకు హాజరు కాగా
ఫోటోస్పాట్ : రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా నిన్న శంషాబాద్ లో ఫోటోగ్రాఫర్ల జిల్లా మహాసభను నిర్వహించారు , ఈ సభ ద్వారా ఫోటోగ్రాఫర్ ఎదుర్కొంటున్న సమస్యలను మరియు ఫోటోగ్రాఫర్ల యొక్క డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు ఈ యొక్క జిల్లా మహాసభ దోహదం చేస్తుందని భావించి రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల ఫోటోగ్రఫీ ఈ సభకు హాజరు కాగా ముఖ్య అతిధి గా హాజరైన ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రివర్యులు శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్ గారు సభను ప్రారంభించారు ఎంతో ప్రశాంతంగా సాగిన ఈ సభలో 27 మండలాలకు చెందిన ఫోటోగ్రాఫర్స్ వారి వారి అభిప్రాయాలను మరియు ఆవేదనను కూడా మంత్రిగారికి విన్నపించుకున్నారు అనంతరం మంత్రివర్యులు శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ మీరు జీవితాంతం కష్టపడి , మా జీవితం లో తీపిగుర్తులను అందించే మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయని నాకు తెలియదు , ఒక మంచి మనిషి ఎదుగుదలకు మరియు ఒక చెడ్డ మనిషి పతనానికి ప్రముఖపాత్ర పోషించేది ఒక ఫోటోగ్రాఫర్ . మీరు చుపిస్తేనే ప్రజల్లోకి వెళ్తుంది అని మీరు చెప్పిన ప్రతి విషయం నేను ప్రత్యేకంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అని నన్ను ఇక్కడికి పిలిచినందుకు నా ప్రత్యేక ధన్యవాదములు ఒక ఫోటోగ్రాఫర్ జీవితం గురుంచి తెలుసుకోవడం చాల సంతోషంగా ఉన్నది అని అయన అన్నరు అయన అన్నారు , ప్రసంగం అనంతరం అయన పలువురికి మెమొంటోస్ ను అందచేశారు . ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శివలింగం గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి శేఖర్ పేరేపల్లి గారు, కోశాధికారి ఏర్పుల మల్లేష్ గారు, జిల్లా గౌరవాధ్యక్షులు రూపస్ గారు తదితరులు పాల్గొన్నారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?