ఫోటోగ్రాఫర్స్ సమస్యలపై పలు జిల్లాల, మండలాల ఫోటోగ్రాఫర్ల సమావేశం
ఫోటోస్పాట్ : ఈరోజు దుబ్బాక మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల యొక్క ఆరోగ్యం, ఆర్థిక, విలువల దృష్ట్యా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి దాదాపు 30 మండలాలు మరియు వివిధ జిల్లాలు నుంచి అత్యధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
ఫోటోస్పాట్ : ఈరోజు దుబ్బాక మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల యొక్క ఆరోగ్యం, ఆర్థిక, విలువల దృష్ట్యా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి దాదాపు 30 మండలాలు మరియు వివిధ జిల్లాలు నుంచి అత్యధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ యొక్క సమావేశంలో ఫోటోగ్రాఫర్లు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసినప్పటికీ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడి పోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన చాలామంది ఫోటోగ్రాఫర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన సమయపాలన లేకుండా పనిచేయడం వలన తీవ్రమైన అనారోగ్యాలకు గురి అవుతున్నారు. రాత్రి సమయాలలో నిద్రలు లేకుండా వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రోగ్రామ్స్ యొక్క ఖచ్చితమైన సమయాలను నిర్ణయించారు మరియు ఖచ్చితమైన కనీస ధరల గురించి ఫోటోగ్రాఫర్లందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల యొక్క సమస్యలను గుర్తించి ఫోటోగ్రాఫర్లను ఆదుకోవాలి మరియు వారికి భీమా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇట్టి సమయాలను మరియు ధరలను ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ పాటించవలసిందిగా నిర్ణయించారు అదేవిధంగా కస్టమర్లు కూడా ఫోటోగ్రాఫర్లకు సహకరించవలసిందిగా తెలియజేయడమైనది.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?