ఓ చిన్నరి ప్రాణం కాపాడిన ఫోటోగ్రాఫర్స్

ఫోటోస్పాట్ : ఓ చిన్నరి ప్రాణం కాపాడిన ఫోటోగ్రాఫర్స్ . సుమారు 2,00000 రూపాయల కు పైగా ఆర్ధిక  సహాయం , మానవత్వం చాటుకున్న ప్రతి ఫోటోగ్రాఫర్ కి  ప్రత్యేక  ధన్యవాదాలు . వివరాల్లో కి వెళ్ళితే  జగన్నాధపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  లో సభ్యుడైన రాము కి ఒక కుమారుడు , కొంత కాలంగా తన కుమారుడు అనారోగ్యం

Mar 28, 2024 - 18:14
 0  2378
ఓ చిన్నరి ప్రాణం కాపాడిన ఫోటోగ్రాఫర్స్

ఫోటోస్పాట్ : ఓ చిన్నరి ప్రాణం కాపాడిన ఫోటోగ్రాఫర్స్ . సుమారు 2,00000 రూపాయల కు పైగా ఆర్ధిక  సహాయం , మానవత్వం చాటుకున్న ప్రతి ఫోటోగ్రాఫర్ కి  ప్రత్యేక  ధన్యవాదాలు . వివరాల్లో కి వెళ్ళితే  జగన్నాధపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  లో సభ్యుడైన రాము కి ఒక కుమారుడు , కొంత కాలంగా తన కుమారుడు అనారోగ్యం తో బాధపడుతున్నాడు ఈమేరకు డాక్టర్ ని సంప్రదించగా ఆపరేషన్ చెయ్యాలి కొంత ఖర్చు అవుతుంది అని సూచించగా రాముది మధ్య తరగతి కుటుంబం ఇప్పటికి తమ కుటుంబాన్ని పోషించడానికి చాల ఇబ్బంది పడుతుండగా , ఈ విషయం తెలుసుకున్న కాకినాడ ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ  అసోసియేషన్ సభ్యులు రాము కుటుంబాన్ని ఆదుకోవాలి అని ఈ నెల 18-3-2024 తారీఖున మెసేజ్ గ్రూప్ లో పెట్టడం జరిగింది . విషయం తెలుసుకున్న వారు తమ వంతు సహాయాన్ని అందించారు . మొత్తం ముఖ్యంగా కాకినాడలో ఉన్న నాలుగు అసోసియేషన్లు కార్యవర్గానికి మరియు సభ్యులకు,అలాగే కాకినాడ జిల్లాతో అనుసంధానంగా ఉన్న అన్ని మండల అసోసియేషన్స్ కలిపి సుమారు 2,00000 రూపాయల కు పైగా ఆర్ధిక  సహాయాన్ని సమకూర్చారు . ఈరోజు అసోసియేషన్స్ సభ్యులు  వారి కుటుంబాన్ని కలిసి చెక్కును అందచేశారు . చిన్నారి ప్రణయ్ కి ఏప్రిల్ 11 వ తారీకున చెన్నై దగ్గర రాయవెల్లూరు లో ఆపరేషన్ చెయ్యనున్నారు ,  ఆ భగవంతుని దయవలన, మీ అందరి చల్లని ఆశీస్సులుతో చిన్నారి ప్రణయ్ నిండు నూరేళ్లు  ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని , కేవలం 8 రోజులలో ఇంత అమౌంట్ ను సమకూర్చేందు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుతూ , అసోసియేషన్ నాకు ఏం చేసింది అసోసియేషన్ వల్ల ఉపయోగం ఏమిటి అని  చాలామంది అడుగుతుంటారు,
దానికి ఇదే నిదర్శనం అని వారు అన్నారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow