సాయి కి మద్దతుగా పలు ఫోటోగ్రాఫర్స్ సంఘాలు నిరసనలు
ఫోటోస్పాట్ : విశాఖ జిల్లా అతి కిరాతకంగా హత్యకు గురైన మధురవాడ కు చందిన సాయి కి మద్దతుగా పలు ఫోటోగ్రాఫర్స్ సంఘాలు నిరసనలు చేస్తున్నారు . తూర్పు గోదావరి జిల్లాలో విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి అత్యంత దారుణంగా హత్య చెయ్యబడ్డ విషయం మనకు అందరికి తెలిసిన విషయమే . ఎంతో ప్యాషన్ తో ఫోటోగ్రఫీ రంగం లో అడుగు పెట్టిన సాయి తన కలలు ఆశయాలు తీరకుండానే ఇలా హత్యా కాబడటం ఎంతో బాధాకరం .

ఫోటోస్పాట్ : విశాఖ జిల్లా అతి కిరాతకంగా హత్యకు గురైన మధురవాడ కు చందిన సాయి కి మద్దతుగా పలు ఫోటోగ్రాఫర్స్ సంఘాలు నిరసనలు చేస్తున్నారు . తూర్పు గోదావరి జిల్లాలో విశాఖ ఫోటోగ్రాఫర్ సాయి అత్యంత దారుణంగా హత్య చెయ్యబడ్డ విషయం మనకు అందరికి తెలిసిన విషయమే . ఎంతో ప్యాషన్ తో ఫోటోగ్రఫీ రంగం లో అడుగు పెట్టిన సాయి తన కలలు ఆశయాలు తీరకుండానే ఇలా హత్యా కాబడటం ఎంతో బాధాకరం . హత్య జరిగి ఎన్ని రోజులు కావస్తున్నా కేసుకు సంబంధించి నిర్ణయాన్ని పోలీస్ లు ఇంత వరకు బయట పెట్టలేదు . సాయి కుటుంబానికి సరైన న్యాయాన్ని ఇవ్వలేక పోతుంది న్యాయ వ్యవస్థ మరియు పోలీస్ వ్యవస్థ అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి పలు సంఘాలు . రాష్ట్రం లో మళ్ళి ఇటువంటి సంఘటనలు జరగకుండా హంతకులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు . ఇదే విషయం పై గౌరవనీయులైన రాష్ట్ర శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారాం గారికి కలిసి ఆంధ్రప్రదేశ్ ఫోటో,వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు మెట్ట నాగరాజు వ్రాసుకున్న వినతి పత్రం అందజేశారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






