365 రోజులు హై స్పీడ్ 5G డేటాను అందిస్తున్న జియో
ఫోటోస్పాట్ : సంవత్సరం పాటు హై స్పీడ్ 5G డేటా అందిస్తుంది జియో , దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన జియో తన వెబ్‌సైట్ లో జాబితాను రూ. వార్షిక రీఛార్జ్‌ని ఎంచుకునే వినియోగదారుల కోసం

ఫోటోస్పాట్ : సంవత్సరం పాటు హై స్పీడ్ 5G డేటా అందిస్తుంది జియో , దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన జియో తన వెబ్‌సైట్ లో జాబితాను రూ. వార్షిక రీఛార్జ్‌ని ఎంచుకునే వినియోగదారుల కోసం అపరిమిత 5G డేటాను అందించడానికి ఈ రూ. 2,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది . ఇది 5G వేగంతో రోజువారీ డేటా 2.5GB మరియు సంవత్సరానికి 912.5GB డేటాను అందిస్తోంది. ఈ జియో రీఛార్జ్ ప్లాన్ విలువ ధర రూ. 2,999 గా ఉండగా దీనిలో కస్టమర్‌లు రోజువారీ 2.5GB డేటాను దాటిన తర్వాత కూడా వారికి అపరిమిత డేటా యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే, 4G పరికరాల్లోని వినియోగదారుల మాదిరిగానే, టెలికాం ఆపరేటర్ రీఛార్జ్ ప్లాన్ కోసం జాబితా ప్రకారం, 5G పరికరాలతో వినియోగదారులకు కూడా బ్రౌజింగ్ వేగాన్ని 64Kbps స్పీడ్ కి తగ్గించింది . జియో వినియోగదారులు ఈ రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటుగా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ మరియు జియో క్లౌడ్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందుకుంటుంది. ఈ టెలికాం ప్రొవైడర్ వినియోగదారులకు ఇతర విలువైన వారి ప్రీపెయిడ్ ప్లాన్‌లను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. వీటిలో రూ. 61 , రూ.119, రూ. 149, రూ. 179, రూ. 199, మరియు రూ. 209 టాప్ అప్ మీరు అదనంగా డేటా పొందవచ్చు అని జియో తెలిపింది .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






