ఘనంగా ముగిసిన ఆదర్శ చిలకలూరిపేట అసోసియేషన్ వారి సోనీ వర్క్ షాప్
ఫోటోస్పాట్ : పల్నాడు జిల్లా ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారం తో ఆదర్శ చిలకలూరిపేట నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు చిలకలూరిపేట లో ఆగస్టు 1వ తేదీన సుమారు 250 మంది ఫోటోగ్రాఫర్స్ తో సోనీ వర్క్ షాప్ ను ఘనంగా నిర్వహించారు.

ఫోటోస్పాట్ : పల్నాడు జిల్లా ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారం తో ఆదర్శ చిలకలూరిపేట నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు చిలకలూరిపేట లో ఆగస్టు 1వ తేదీన సుమారు 250 మంది ఫోటోగ్రాఫర్స్ తో సోనీ వర్క్ షాప్ ను ఘనంగా నిర్వహించారు. Sony కంపెనీ మెంటార్స్ అయిన సతీష్ గారు, ఫారుక్ గారు సోనీ కెమెరా లో వచ్చిన నూతన టెక్నాలజీ ,సెట్టింగ్స్ మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు. ఈ workshop కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎడిట్ పాయింట్ అధినేత శ్రీ డాక్టర్ ఇప్పలపల్లి రమేష్ గారు ఫోటోగ్రాఫర్స్ ను ఉద్దేశించి, ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిత్వ పరంగా ఎంత దృఢంగా వుండాలో వారి ప్రసంగం లో తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పల్నాడు జిల్లా అధ్యక్షులు రామిశెట్టి చంద్రశేఖర్ గారు, కార్యదర్శి వేల్పూరి సైదాచారి గారు
కోశాధికారి జోకా బ్రహ్మ రావు గారు చిలకలూరిపేట ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా అభిరామ్ గారు మరియు కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు గారు, మరియు పట్టణ సీనియర్ ఫోటోగ్రాఫర్స్ పల్నాడు జిల్లా ఫోటోగ్రాఫర్స్ టెక్నికల్ & సోషల్ మీడియా ఆర్గనైజర్ జ్యోతి ఆనంద కుమార్, రామినేని భరత్ కుమార్ గారు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






