ప్రతి ఫొటోగ్రాఫరుకు , వీడియోగ్రాఫరుకు , ఎడిటర్ కు అవసరమైన వర్కుషాపు

ఫోటోస్పాట్ : భాషా,సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు  సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ  సంయుక్త ఆధ్వర్యములో తెలుగు లో నిర్వహిస్తున్న " ప్రాక్టికల్ ఫోటోగ్రఫీ వర్కుషాప్ ,ప్రీ-వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్,  రవీంద్రభారతి హైదరాబాద్ నందు 2023  ఆగస్టు 3 నుండి 9 వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు.

Jul 22, 2023 - 11:02
 0  597
ప్రతి ఫొటోగ్రాఫరుకు , వీడియోగ్రాఫరుకు  , ఎడిటర్ కు అవసరమైన వర్కుషాపు

ఫోటోస్పాట్ : భాషా,సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు  సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ  సంయుక్త ఆధ్వర్యములో తెలుగు లో నిర్వహిస్తున్న " ప్రాక్టికల్ ఫోటోగ్రఫీ వర్కుషాప్ ,ప్రీ-వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్,  రవీంద్రభారతి హైదరాబాద్ నందు 2023  ఆగస్టు 3 నుండి 9 వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాప్ లో  ప్రతి ఫోటోను తీసిన తర్వాత అందంగా ఎలా కంపోజ్ చెయ్యాలి ? ప్రతి ఫ్రేమ్ లో కంపొజిషన్,బ్యాలెన్సింగ్ చేయడం ఎలా ? ఫ్రేమింగ్ ఎలా చెయ్యాలి ?  రూల్ అఫ్ థర్డ్ అంటే ఏమిటి ? రూల్స్ ను ఉపయోగించి ఫోటోలు ఎలా తీయాలి ? మాస్టర్ పోజింగ్ ఎలా చెయ్యాలి ? త్రి డి ఇమేజ్ ను ఎలాంటి లైటింగ్ ద్వారా తీయ వచ్చును ?వైట్ బ్యాలన్స్ అంటే ఏమిటి ? ప్రతి ఫోటో లో కలర్స్ అద్భుతముగా రావాలి అంటే ఏమి చెయ్యాలి ? స్కేల్ అంటే ఏమిటి ? లీడింగ్ లైన్స్ అంటే ఏమిటి ? ఫోటో లో రిలీఫ్ ఎలా ఉండాలి ? వంటి అంశాలపై క్లుప్తంగా వివరించనున్నారు . ఫొటోగ్రాఫర్లకు  ఒక మంచి అవకాశం, ఫోటోగ్రఫీ రంగములో వస్తున్న పెను మార్పులకు దృష్టిలో పెట్టుకొని మీ  ఆలోచనలకూ అనుగుణంగా  ఫోటోగ్రఫీ మెళుకువలను దిశా నిర్దేశం చేస్తారు ఈ అవకాశం ఫోటోగ్రఫీలో పైకి ఎదగాలని ఉన్న వారికి మాత్రమే కాకుండా టెక్నాలజీ గురుంచి అవగాహనా లేని వారికోసం కూడా . ఈ ఫోటోగ్రఫీ వర్కుషాపు ద్వారా మీరు ఎన్నో మెళుకువలు నేర్చుకోవచ్చు,  శిక్షణ అనంతరము అప్రిసియేయేషన్  సర్టిఫికెట్ ఇవ్వనన్నారు . వెంటనే రిజిస్టర్ చేసుకోండి,రిజిస్ట్రేషన్లు ప్రారంభించబడినవి - రిజిస్ట్రేషన్లకు చివరి తేది 31 జూలై, 2023 ముందు రిజిస్ట్రేషన్లు చేసికొన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును వివరాలకు ఎం.సి.శేఖర్ -  సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ,హైదరాబాద్ - 8008021075 , 70956 92175.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow