ది ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫెర్ అసోసియేషన్ వారి 184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ : ది ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫెర్ అసోసియేషన్ - కాకినాడ జిల్లా వారి ఆద్వర్యంలో 184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ది 16-8-2023 బుధవారం కాకినాడ సూర్యకళా మందిరం నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లాలోని 18 మండలాల నుండి కాకినాడ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు మరియు పెద్ద ఎత్తున ఫోటో వీడియోగ్రాఫర్లూ విచ్చేశారు

Aug 18, 2023 - 13:16
 0  133
ది ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫెర్ అసోసియేషన్ వారి  184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఫోటోస్పాట్ : ది ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫెర్ అసోసియేషన్ - కాకినాడ జిల్లా వారి ఆద్వర్యంలో 184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ది 16-8-2023 బుధవారం కాకినాడ సూర్యకళా మందిరం నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లాలోని 18 మండలాల నుండి కాకినాడ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు మరియు పెద్ద ఎత్తున ఫోటో వీడియోగ్రాఫర్లూ విచ్చేశారు.జిల్లా అధ్యక్షులు తోట సూర్య సుబ్బారావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ముందుగా డాగురే గారి చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.ముఖ్య అతిథి కాకినాడ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే అన్ని సంఘాలతో పాటు మీకు కూడా కాకినాడ లో అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తామని, ఫోటో, వీడియో గ్రాఫర్లకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని ఫోటోగ్రఫీ లో మరింత రాణించాలని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాగిరెడ్డి చంద్ర కళా దీప్తి అన్నారు.మరో అతిథి 32వ వార్డు కార్పొరేటర్ సత్యనారాయణ అందరికి వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా 18 మండలాల అసోసియేషన్ లలో ఇద్దరేసి చొప్పున సీనియర్లని వారి అధ్యక్షులతో కలిపి ఘనంగా సన్మానించారు.కాకినాడ జోన్ ఇంచార్జీ శీలమంతుల గౌరి గారు మరియు కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షుడు యశ్వంత్ శ్రీను, కార్యదర్శి ఖమ్రు, కోశాధికారి పేపకాయల బద్రి, ఉప కార్యదర్శి పిట్టా శ్రీను, వరహాలరాజు, ఉపాధ్యక్షులు అడబాల రాజేష్, మండా రమేష్, గౌరవ సలహాదారులు షేక్ గౌస్, పైలా శ్రీనివాస్, కాకినాడ అసోసియేషన్స్ పెద్దలు వీరబాబు,కళ్యాణ్ రావు,కుమార్,నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమ నిర్వహణ లో పాలుపంచుకున్నారు. హనీ కలర్ లాబ్ బాబీ అందరికీ చక్కటి విందు ఏర్పాటు చేశారు. కాకినాడలో ఉన్న అన్ని కలర్ లాబ్స్ మరియు భాగ్యశ్రీ ఎలెక్ట్రానిక్  రమేష్ గారు తమ సహాయ సహకారాలు అందించారు.

Gopala Raju danthuluri Kakinada Reporter

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow