కాకినాడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  నూతన అధ్యక్షుడు ఎన్నిక

ఫోటోస్పాట్ : 9-4-2025 కాకినాడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  నూతన అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ జరిగింది. నూతన అధ్యక్షుడు ఎంపికకు కొవ్వాడ బుజ్జి, గౌరీ శంకర్, డిజిటల్ ప్రసాద్ లు నామినేషన్ లు వేయగా, కొవ్వాడ బుజ్జి గారు పోటీ నుంచి తప్పుకోగా మిగిలిన ఇద్దరికీ రహస్య ఓటింగ్ నిర్వహించారు.

Apr 10, 2025 - 15:28
Apr 10, 2025 - 19:01
 0  19
కాకినాడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  నూతన అధ్యక్షుడు ఎన్నిక

ఫోటోస్పాట్ : 9-4-2025 కాకినాడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  నూతన అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ జరిగింది. నూతన అధ్యక్షుడు ఎంపికకు కొవ్వాడ బుజ్జి, గౌరీ శంకర్, డిజిటల్ ప్రసాద్ లు నామినేషన్ లు వేయగా, కొవ్వాడ బుజ్జి గారు పోటీ నుంచి తప్పుకోగా మిగిలిన ఇద్దరికీ రహస్య ఓటింగ్ నిర్వహించారు. అసోసియేషన్ చైర్మెన్ శ్రీ ఐ.ఎస్.గోపాల్ గారు, గౌరవ అధ్యక్షుడు తోట సూర్య సుబ్బారావు గారు, అధ్యక్షుడు కోడూరి కుమార్ గారు, కార్యదర్శి వానపల్లి శ్రీనివాసరావు గారు, కోశాధికారి కాళేశ్వర రావు గార్ల ఆధ్వర్యంలో పరశురాం  మరియు విక్టరీ సుబ్రమణ్యం గార్లు పోలింగ్ ప్రతినిధులు గా ఉదయం 10 గం. ల నుండి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు.146 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన లెక్కింపు లో శ్రీ G.A.V.S. ప్రసాద్ (డిజిటల్ ప్రసాద్) నూతన అధ్యక్షుడు గా గౌరీ శంకర్ గారి పై 12 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సహకరించిన సభ్యులు అందరికీ కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గా ఎన్నికయిన శ్రీ G.A.V.S. PRASAD (డిజిటల్ ప్రసాద్) మాట్లాడుతూ తనను ఎన్నుకున్న సభ్యులకు పేరుపేరునా కృతఙ్ఞతలు చెప్పారు.త్వరలో మిగతా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు.

Gopala Raju danthuluri Kakinada Reporter

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow