గజ్వేల్‌లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ & AI వర్క్‌షాప్ పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం నిర్వహించనున్న “వెడ్డింగ్ ఫోటోగ్రఫీ & AI వర్క్‌షాప్” పోస్టర్‌ను గజ్వేల్ ఏసీపీ నర్సింలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.
ఫోటోస్పాట్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం నిర్వహించనున్న “వెడ్డింగ్ ఫోటోగ్రఫీ & AI వర్క్‌షాప్” పోస్టర్‌ను గజ్వేల్ ఏసీపీ నర్సింలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఏసీపీ నర్సింలు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సరికొత్త టెక్నాలజీలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా వృత్తిలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. ఫోటోగ్రఫీ రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమను కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల ఫోటోగ్రాఫర్స్ సంఘం అధ్యక్షుడు బొల్లిబత్తుల నాగరాజు, ఉపాధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి ఇండియన్ మిక్సింగ్ శ్రీను, కోశాధికారి అల్వాల యాదగిరి, సహాయ కార్యదర్శి బండారి మహేందర్‌తో పాటు మండల కమిటీ నిర్వాహకులు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు మరియు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?











