జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా టి. నరసాపురంలో లూయిస్ డాగురే విగ్రహానికి ఘన నివాళి
ఫోటోస్పాట్ : జాతీయ కెమెరా దినోత్సవాన్ని పురస్కరించుకుని టి. నరసాపురంలోని లూయిస్ డాగురే ఫోటో & వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, కెమెరా ఆవిష్కర్తగా గుర్తింపు పొందిన Louis Daguerre విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సంఘం కార్యదర్శి ప్రసాద్ మరియు ఉపాధ్యక్షుడు మహారాజు అధ్యక్షత వహించారు.
ఫోటోస్పాట్ : జాతీయ కెమెరా దినోత్సవాన్ని పురస్కరించుకుని టి. నరసాపురంలోని లూయిస్ డాగురే ఫోటో & వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, కెమెరా ఆవిష్కర్తగా గుర్తింపు పొందిన Louis Daguerre విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సంఘం కార్యదర్శి ప్రసాద్ మరియు ఉపాధ్యక్షుడు మహారాజు అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, "లోకంలోని అందాలను తన కళ్లు చూసినట్లు ప్రపంచానికి చూపించేది ఫోటోగ్రాఫర్. కాలం గడిచినా మధుర జ్ఞాపకాలను పదిలంగా భద్రపరిచేది ఫోటో మాత్రమే" అని పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు మహారాజు మాట్లాడుతూ, "మన జీవితంలో మరచిపోలేని ప్రతి అపురూప క్షణాన్ని శాశ్వతంగా తారతరాలకు గుర్తుండిపోయేలా నిలిపేది కెమెరా. అందుకే కెమెరాకు, ఫోటోగ్రఫీ వృత్తికి సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది" అని అన్నారు. జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ రంగానికి విశేష సేవలందిస్తున్న ప్రతి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌కు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ కళ యొక్క ప్రాముఖ్యతను వివరించి, నేటి డిజిటల్ యుగంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర మరింత కీలకంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని లూయిస్ డాగురే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?











