కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పద్మశ్రీ ఫోటో స్టోర్స్ ప్రారంభం
ఫోటోస్పాట్ : ఏలేశ్వరం మండలం ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శ్రీ డి శ్రీనివాసరావు, శ్రీమతి రేఖ సమీరా దంపతులచే ఏర్పాటు చేయబడిన పద్మశ్రీ ఫోటో స్టోర్స్ , ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ సంబంధిత పరికరాల సంస్థ ను ఈరోజు ఉదయం ఏలేశ్వరంలో కాకినాడ జిల్లా ప్రొఫెషనల్

ఫోటోస్పాట్ : ఏలేశ్వరం మండలం ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శ్రీ డి శ్రీనివాసరావు, శ్రీమతి రేఖ సమీరా దంపతులచే ఏర్పాటు చేయబడిన పద్మశ్రీ ఫోటో స్టోర్స్ , ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ సంబంధిత పరికరాల సంస్థ ను ఈరోజు ఉదయం ఏలేశ్వరంలో కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బచ్చు వీర వెంకట సత్యనారాయణ (తుని చిన్ని) గారు, ఏలేశ్వరం మండల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గంప సాయి పవన్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు చిన్ని గారు మాట్లాడుతూ ఫోటో వీడియో గ్రాఫర్స్ అవసరార్థం అన్ని పరికరాలను అందుబాటులో ఉంచుతూ ఏలేశ్వరంలో ఫోటో స్టోర్స్ ను ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని అన్నారు.ఈ అవకాశాన్ని ఏలేశ్వరం పరిసర ప్రాంత ఫోటో, వీడియో గ్రాఫర్స్ సోదరులు వినియోగించుకోవాలని పద్మశ్రీ ఎలక్ట్రానిక్స్ ఫోటో స్టోర్స్ వారికి సహకరించాలని వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రోఫిషినల్ ఫోటోగ్రఫర్స్ మరియు వీడియోగ్రఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డోకుల.అనంత శ్రీనివాసరెడ్డి గారు మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ యేజ్జు.బుజ్జి గారు మరియు ఏలేశ్వరం మండల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు ఫోటో వీడియో గ్రాఫర్స్ సభ్యులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






