ఫొటోఫిన ముఖ్య అతిధిగా మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు
ఏప్రిల్ 27న మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారి చేతులమీదుగా ఫొటోఫిన ప్రారంభం అవుతుందని ఫొటోఫిన టీం తెలియచేసారు..

ఫోటోస్పాట్ : తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ ఎడిట్ పాయింట్ , ఏప్రిల్ 27,28,29 వ తేదీల్లో జరగబోయే ఫోటోఫీనా 2023 ఫోటో అండ్ వీడియో ఎక్స్ పో కు ఈ రోజు మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది , ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మన్ డాక్టర్ ఇప్పలపల్లి రమేష్ గారు ఈ రోజు అయన కార్యాలయం లో కలిసి ఎక్సిబిషన్ కు ఆహ్వానించారు.. తదనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా ఇంత పెద్దఎత్తున ఎక్స్పో మన తెలంగాణలో నిర్వహిస్తున్నందుకు ఎడిట్ పాయింట్ ఇండియా వారికీ నా అభినందనలు. దేశ నలుమూలలకు హైదరాబాద్ ముఖ్య వేదిక కావడం ఫోటోగ్రఫీ రంగానికి ఒక మైలు రాయి అలాగే కొత్త కొత్త టెక్నాలాజీ ని 500 లకు పైగా కంపెనీలు ప్రదర్శించబోతున్నాయి ఇంతటి గొప్ప అవకాశాన్ని పట్టణ మరియు గ్రామీణ ఫోటోగ్రాఫర్స్ వినియోగించుకోవాలని ఇప్పటికే 19 ఎడిషన్స్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పడు 20 వ ఎడిషన్ ను కూడా అలాగే రాష్ట్ర నలుమూలలా ఫోటో గ్రాఫర్స్ వచ్చి విజయవంతం చేయాలనీ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ భాష మరియు సంస్కృతి శాఖ మరియు తెలంగాణ పర్యాటకశాఖ తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తుంది అని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో తెలంగాణ భాష మరియు సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరి కృష్ణ గారు , తెలంగాణ పర్యాటకశాఖ MD మనోహర్ రావు గారు అర్కలజి డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ రావు గారు ,తెలంగాణ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మార్తా రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు .ఎడిట్ పాయింట్ ఇండియా తన 20వ ఎడిషన్ ఫోటోఫిన ఎక్స్ పో ను తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27, 28, 29 తేదిలలో నార్సింగి లోని ది అడ్రెస్ కన్వెన్షన్ లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) మరియు వందే భారత్ ట్రస్ట్ & KBK Hospitals సహకారం తో నిర్వహిస్తున్నట్లు డా. ఇప్పలపల్లి రమేష్ తెలియచేసారు.ఎడిట్ పాయింట్ ఇండియా తన 20వ ఎడిషన్ ఫోటోఫిన ఎక్స్ పో ను తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27, 28, 29 తేదిలలో నార్సింగి లోని ది అడ్రెస్ కన్వెన్షన్ లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అఫ్ ఇండియా (PPAI) , తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియోగ్రాఫర్స్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ (TPVPA) మరియు వందే భారత్ ట్రస్ట్ & KBK Hospitals సహకారం తో నిర్వహిస్తున్నట్లు డా. ఇప్పలపల్లి రమేష్ తెలియచేసారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






