ఫోటోగ్రఫి టెక్నిక్స్
ఫోటోస్పాట్ : ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళేటప్పుడు టెక్నిక్స్ తెలియక టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అది కావాలని చేసింది కాదు కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే టైం వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు ఈ సంచికలో ముఖ్యమైన ఫోటోగ్రఫీ టెక్నిక్స్ తెలుసుకుందాం.
ఫోటోస్పాట్ : ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళేటప్పుడు టెక్నిక్స్ తెలియక టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అది కావాలని చేసింది కాదు కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే టైం వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు ఈ సంచికలో ముఖ్యమైన ఫోటోగ్రఫీ టెక్నిక్స్ తెలుసుకుందాం.
మీ యొక్క DSLR కెమెరాని అతి జాగ్రత్తగా వాడకండి. చిన్న పాపాయిలా వాడుతుంటారు. దానికి తగినట్టుగా అన్ని రకాలుగా వాడడానికి ప్రయత్నించండి. UV ఫిల్టర్స్ అనేవి వాడడం అనేది మీ సమయాన్ని వృధా చేయడమే. కొన్ని సంవత్సరాల ముందు వరకు వీటిని వాడేవారు.
ప్రోగ్రాంకి వెళ్ళేప్పుడు అనవసరమైన లగేజ్ పక్కన పెట్టి అవసరమైన వాటినే తీసుకెళ్ళండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.. ముందు మీరు తీయబోయే ఈవెంట్ ని బట్టి మీ బాగ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి.
లెన్స్ ని ప్రతిసారి ఉపయోగించాల్సిన అవసరం లేదు.లెన్స్ తో పని లేనప్పుడు పక్కన పెట్టండి. అవసరం లేకున్నా వాడి ఇబ్బంది పడకండి. ఎక్కువగా వాడుకలో ఉన్నలెన్స్ 35mm లెన్స్ ఎక్కువ మంది వాడుతుంటారు. కానీ 50mm లెన్స్ కూడా వాడడానికి సులువుగా ఉంటుంది. మీరు ఉన్న చోటు నుండి కదలలేనప్పుడు సౌకర్యం కోసం జూమ్ వాడండి.
ఇతరుల పనితనాన్ని తప్పుపట్టకండి. వారిని అదేపనిగా గమనించకండి.. మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వారికీ వీలయితే అవసరమైన సహాయాన్ని అందించండి
లెన్స్ కాప్స్ చాలా ధర తక్కువవి కొనండి. ఎందుకంటే చాలా సార్లు లెన్స్ కాప్స్ పోగుట్టుకుంటూ ఉంటాం. ఇలా చేయడం ఖర్చు తగ్గించుకోవడమే.
మీరు తీయబోయే షాట్ గురించి లొకేషన్లో కెమెరా నుండి చూస్తూ ఉంటే మీకు మరిన్ని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఇది పనితనాన్ని మెరుగుపరుస్తుంది.
మంచి కెమెరాలు వాడడం వలన మంచి ఫోటోలు రావాలని ఏమి లేదు అది తీసే విధానంపై ఆధారపడి ఉంటుంది. మీరు షూటికి వెళ్లేముందు మీ కెమెరా ఎలా పనిచేస్తుందో చూసుకోండి అంటే అన్ని సెట్టింగ్స్ సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇలా చేయడం వలన షూట్ సమయంలో ఇబ్బంది ఉండదు. ఎల్లప్పుడు షాటికి రెడీగా ఉండాలి. కంగారులో మనలో చాలా మంది కెమెరా cap తీయడమే మర్చిపోతుంటారు. మెమోరీ కార్డు ఉందో లేదో సరిచూసుకోండి. p మోడ్ అనేది కొత్తగా కెమెరా అపరేటింగ్ నేర్చుకునే వారికే కాదు. మిగతావారు కూడా వాడవచ్చు.Noice పెర్ఫార్మెన్స్ క్లీన్గా ఉన్నప్పుడు అవసరమైతే ISOని తీసివేయండి. ఆటో ISO అనేది బెస్ట్ ఫ్రెండ్ లాంటిది.
ఫోటో అనేది రూల్ ఆఫ్ థర్డ్స్(Rule of thirds) మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫోటో తీసేముందు క్లియర్గా వీటిని తెలుసుకోవడం అవసరం..
ఎక్కువ షాట్స్ తీయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మంచి ఫోటోలు పొందే అవకాశం ఉంటుంది.పాత పద్ధతిలో ఫొటోలు తీయకండి దానివల్ల మెమోరీ స్పేస్ వృధా చేయడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. కొత్త పద్ధతిలో ప్రయత్నించండి. మీరు మీ ఫోటోలను సరిగ్గా తీయట్లేందంటే మీరు సరిగా పొజిషన్లో లేరని అర్ధం. మీరు తీసే షాట్ గురించి ఎక్కువగా ఆలోచించకండి, తీయడం మొదలుపెడితే మంచి షాట్స్ తీయగలుగుతారు. మీ దగ్గర ఫోటోలు
తీయడానికి మంచి మంచి పరికరాలు ఉంటే సరిపోదు ఎక్కడ నిలబడి ఫోటో తీస్తే బాగా వస్తుందో చూసుకోవాలి. ఫోటోలు తీసేటప్పుడు sharpness సరిగా ఉందో లేదో చూసుకోవాలి లేకుంటే పోస్ట్ ప్రొడక్షన్లో సరి చేసుకోవాలి. ఇలా సరిచేసుకోవడానికి మీరు rawలో తీయడం వల్ల సులువుగా ఉంటుంది. కానీ ప్రతీసారి అదే శైలిని ప్రయత్నించవద్దు ఎందుకంటే మీ ఫోటోలని మీరే కాపీ కొట్టినట్టుగా ఉంటుంది.
కాన్సెప్ట్ అనేది కింగ్ లాంటింది. మీరు అనుకునే కాన్సెప్ట్క తగినట్టుగా ఫోటోలు తీయడం లేదా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయడం మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఫోటోగ్రఫీ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ షూట్ చేసేటప్పుడు మీరు తప్పుగా ఉన్నట్లయితే ఆ అందమైన environment చెడిపోతుంది.
మద్యపానం సేవించి షూట్ చేయకండి. మిగతావారు మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది.
మీకు అలవాటు ఉంటే మద్యపానం సేవించినపుడు షూట్ ప్రాక్టీసు చేయండి. ఎందుకంటే కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కానీ మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం …
మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేదా మీరు ఏం ఆలోచించకుండా ఉన్నపుడు వీలైనంత తినండి.
కానీ షూట్ మధ్యలో తిన్నట్లైతే మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
కొన్ని కొన్ని సమయాల్లో అంటే తెల్లవారుజామున, సంధ్యా సమయాల్లో లేదా రాత్రి వేళల్లో ఫోటోలు తీసే అవకాశం వస్తుంది.సమయానికి తగినట్టుగా ఎలాంటి లైటింగ్ వాడాలో తెలుసుకొని ఉండాలి. ప్రతిరోజూ ఉదయం లేచి కాస్త వ్యాయామం చేయండి.. ఆ టైంలో కొద్దిగా ప్రాక్టీసు కూడా చేయడం మంచిది.
ఫోటోగ్రఫీ అనేది ఫోటో తీసే ఒక వ్యక్తి యొక్క ప్రతిబింబంగా ఉండాలి. అంటే మీరే అద్దంలో చూస్తూ మీ యొక్క ఫోటోలను తీయడానికి ప్రయత్నించండి. మీ poseలను గమనించండి. కానీ ఎవరు మీ చుట్టూ లేనప్పుడు ఎవరూ మిమ్మల్ని గమనించనపుడు ప్రయత్నించండి.
ఫోటోగ్రాఫర్లకు వివేకం అనేది చాలా ముఖ్యమైనది ఎక్కడ ఫ్లాష్ వాడాలి, లైట్ ఎక్కడ వాడాలి, ఏ యాంగిల్ తీయాలి అనేది తెలుసుండాలి. మీరు చేసే ప్రోగ్రాం థీమ్ ని బట్టి మీ కెమెరా సెట్టింగ్ మార్చుకోవడం వలన మీరు ఫోకస్ ఉంటారు. మీలోని సృజనాత్మకతని వాడి మీరు ఫోటోలు తీయడానికి సులువుగా ఉంటుంది.
అప్పుడప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వస్తువులు లేదా మీరు చాలా రోజులనుండి వాడుతున్న వస్తువులను మార్చడం వలన ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.
ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా అప్పుడప్పుడు బాగా లేని ఫోటోలు తీస్తాడు అప్పుడప్పుడు అద్భుతమైన బ్లాక్స్ మంచి ఫోటోలు తీస్తాడు. మళ్లీ మళ్లీ ప్రయత్నించడం వలన బాగా లేని ఫోటోలు రాకుండా జాగ్రత్త పడుతూ మంచి ఫొటోలతో ముందుకు వెళ్ళాలి. మీకు మీరు మంచి విమర్శకుడిగా ఉండండి. మీరు తీసిన ఫోటోలను గమనిస్తూ ఫోటోలు బాగా రాకపోవడానికి లేదా బాగా రావడానికి కారణాలేంటో వెతకండి. బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. కెమెరా నుంచి చూస్తూ ఫోటోలను తీయడం మాత్రమే సరిపోదు. తీస్తున్న ఫోటోలను హార్ట్ ఫీల్ అవ్వగలగాలి.
ఎల్లప్పుడు మీ దగ్గర కెమెరా ఉండేలా చూసుకోవాలి. అద్భుతమైన దృశ్యం కనపడినపుడు ఫోటో తీస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మీ విజువల్ థింకింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మీకు మీరు ఫోటో తీసే మీ సబ్జెక్టుతో Relationship ఉండాలి, మీ కెమెరాతో కాదు.
మీరు తీసిన ఫోటోలను సెలక్షన్ చేసేటప్పుడు కఠినంగా వ్యవహరించండి. బాగా లేని
ఫోటోలను డిలీట్ చేయడం మంచి ఫోటోలను సెలెక్ట్ చేయడం వంటివి చేయండి .మీరు తీసిన బెస్ట్ ఫోటోలను మాత్రమే కస్టమర్స్ కి చూపించండి.
ఇతర ఫోటోగ్రాఫర్లు తీస్తున్న ఫోటోలని వెబ్-సైట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు గమనించండి. ఏ ఫోటోలు బాగున్నాయో ఏ ఫోటోలు బాగాలేవో అంచనా వేయడానికి ప్రయత్నించండి. మీరు తీసిన ఫోటోలను online లో ఉంచడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇతరులు మీ వర్క్ చూసి మిమ్మల్ని అభినందించడం లేదా విమర్శించడం చేస్తారు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మంచి ఫోటోలు తీయడానికి ఎలాంటి షార్ట్-కట్ లేదు. మెళకువలు నేర్చుకొని ఎక్కువగా ప్రాక్టీసు చేయడం తప్ప.
మనం మనకు నచ్చిన ఫోటోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని వాటిని కలర్ కరెక్షన్ చేసుకొని అలాగే ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. సెలక్షన్ కోసం మనం తీసిన అన్ని ఫోటోస్ ఇవ్వకుండా ముందే మనం డిలీట్ చేసుకుంటే తొందరగా ప్రాసెస్ పూర్తి అవుతుంది.
కెమెరాలో రికార్డ్ అయిన ఫైల్ నేమ్తో కాకుండా మీ బిజినెస్ నేమ్ ఇమేజ్ పెట్టుకోవాలి. మీరు ఇచ్చే ఫోటోస్ ఫోల్డర్లో మీ బిజినెస్ కార్డు సాఫ్ట్ కాపీ పెట్టండి.
selection కోసం ఫైల్ నంబర్స్ రాసుకోవడం కాకుండా ఈజీ సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి అవి వాడటం ద్వారా చాలా ఈజీగా పని పూర్తవుతుంది.
Files out-put ఇచ్చాక డిలీట్ చేస్తారు చాలామంది, కానీ వాళ్ళ గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ పెట్టిస్తే సేఫ్ ఉంటాయి.
లేదా మీరు కంపెనీ పేరుతో సంవత్సరానికికి Rs.5000 to 7000 పెట్టడం వల్ల onedrive లాంటి online స్పేస్ దొరుకుతుంది. మీ కస్టమర్లు అందరి ఫైల్స్ అందులో పెట్టుకోవచ్చు.
మీ బిజినెస్ మార్కెటింగ్ మీరే చేసుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు బ్రాండింగ్ ఉండేలా చూసుకోండి.
మీరు వీడియో కనుక ఇస్తే లాస్లో మీ వాయిస్ తో కూడిన వీడియో ఇవ్వండి. థాంక్స్ పాటుగా మీరు చేసే పనులు చెప్పండి.
T-shirts లేదా మీరు ఉపయోగించే లైటింగ్ పైన మీ కంపెనీ నేమ్ మరియు ఫోన్ నంబర్ ఉండాలి. వాటికీ ట్యాగ్లు ఉండేలా చూసుకోండి. వెబ్ సైట్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి..
మీరు ఎవరినైనా కాంట్రాక్టు బేస్ లో విసిట్ పైన తీసుకువస్తే వారి దగ్గర మీ విసిటింగ్ కార్డు ఉండేలా ప్లాన్ చేసుకోండి. వారికి మీ బ్రాండింగ్ ఉండాలి పైన చెప్పిన టిప్స్ అన్ని కూడా మీరు పాటించినట్లయితే మీ నుండి బెస్ట్ ఫోటోలు వస్తాయి. ఇవన్ని అనుభవాలతో చేసినవి చెప్పినవి.. ఇవేకాకుండా ఇంకా మీకు తెలిసినవి చాలా ఉంటాయి.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?