నిలకడ గా స్మూత్ కెమెరా షాట్స్

ఫోటోస్పాట్: మనలో చాలా మంది స్మూత్ కెమెరా షాట్స్ తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. షేకి ఫుటేజ్ తో తంటాలు పడుతూ ఉంటారు. Stability shots కోసం మార్కెట్ లో చాలా రకాల సాఫ్ట్ వేర్స్ ఉన్నవి. ఇవి చాల ఖర్చుతో కూడుకున్నవి చాల మంది వీటిని ఖరీదు చేయడానికి వెనకాడుతుంటారు. ఖర్చులేకుండా Stability స్మూత్ షాట్స్నాలుగు విధాలుగా తీయవచ్చును. ఇప్పుడు అవేమిటో చూద్దాం.

Feb 12, 2023 - 10:32
 0  99
నిలకడ గా స్మూత్ కెమెరా షాట్స్

ఫోటోస్పాట్: మనలో చాలా మంది స్మూత్ కెమెరా షాట్స్ తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. షేకి ఫుటేజ్ తో తంటాలు పడుతూ ఉంటారు. Stability shots కోసం మార్కెట్ లో చాలా రకాల సాఫ్ట్ వేర్స్ ఉన్నవి. ఇవి చాల ఖర్చుతో కూడుకున్నవి చాల మంది వీటిని ఖరీదు చేయడానికి వెనకాడుతుంటారు. ఖర్చులేకుండా Stability స్మూత్ షాట్స్నాలుగు విధాలుగా తీయవచ్చును. ఇప్పుడు అవేమిటో చూద్దాం.

ఒకటి:

సాఫ్ట్ వేర్ ప్లగిన్ wrap stabilizer వాడడం వలన shakyness తగ్గించవచ్చు. ఇది వాడడం చాల తేలిక, shakyness తగ్గించాలనుకుంటున్న వీడియోని టైం లైన్ మీద వేసి, దానికి wrap stabilizer ప్లగిన్ అప్లై చేయాలి. మీరు తీసుకున్న వీడియో shakyness పోయి స్మూత్ క్లిప్ గా రెడీ అవుతుంది. ఇది కేవలం చిన్న చిన్న shakyness movements సరిచేయడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. మోషన్ బ్లర్, రోలింగ్ మూవ్మెంట్స్ వంటి పెద్ద పెద్ద వాటికీ ఇది పని చేయదు. ఒకవేళ ప్లగిన్ అప్లై చేసినట్లయితే జెల్లీ వీడియోగా తయారవుతుంది.

రెండు:

Shakyness పోవడానికి రెండవ మార్గం స్లో మోషన్ లో వీడియో రికార్డు చేయడం దీనివలన సడన్ shaky movements కాస్తా స్మూత్ & స్టైల్ గా రావడం కనపడుతుంది. ఇందులో కూడా 100% shakyness పోవడం జరగదు ఏదైనా డైలాగ్ చెప్పే సన్నివేశంలో స్లో మోషన్ షూట్ అనేది చాలా ఇబ్బందిగా  కనపడుతుంది. కానీ మ్యూజిక్ ఆల్బం, సాంగ్స్ వంటి వాటికీ స్లో మోషన్ బాగా పనిచేస్తుంది.

మూడు:

Shakyness పోవడానికి మూడవ మార్గం వీడియో షూట్ అనేది హై రిజల్యుషన్ 4K+ లో రికార్డు చేయడం వలన extra రిజల్యుషన్ ని ఎడిటింగ్ లో add చేసుకొని Shakyness తగ్గించవచ్చు లేదా ఫుటేజ్ ని zoom-in, zoom-out ద్వారా Shakyness తగ్గించవచ్చు.ఇలా చేయడం  వలన కొంతవరకు ఉపయోగం ఉంటుంది కానీ foreground background S డీటెయిల్స్ మిస్ అవ్వడం జరుగుతుంది.

నాలుగు:

Shakyness పోవడానికి నాల్గవ మార్గం షూటింగ్ టైంలో అసలైన stabilizer ని వాడి Shakyness తగ్గించవచ్చు. ఇప్పుడున్న మార్కెట్లో చాలా రకాలైన stabilizerలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా light cam weight   stabilizers ఇవి కెమెరా weightని  బాలెన్స్ చేస్తూ ఎలాంటి జెర్క్స్ లేకుండా స్మూత్ ఫుటేజ్ ని రాబట్టుకోవచ్చు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow